పవన్ కోసం హాలీవుడ్ స్టార్‌ని దించేస్తున్నారు!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో క్రేజీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ `ఓజీ`. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.;
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో క్రేజీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ `ఓజీ`. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటం, ప్రభుత్వంలో డిప్యూటీ పసీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఆయనకు ఖాలీ టైమ్ లభించడం లేదు. దీంతో అంగీకరించిన సినిమాల షూటింగ్‌లు నిరవధికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇదే కారణం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న `హరి హర వీరమల్లు` షూటింగ్ మళ్లీ మొదలు కావడం తెలిసిందే.
ఇదే తరహాలో సుజీత్ తెరకెక్కిస్తున్న `ఓజీ` షూటింగ్ కూడా తిరిగి ప్రారంభం కాబోతోంది. ఇందులో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లోగ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. ఈ మూవీ ప్రకటించిన దగ్గరి నుంచి అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఆగిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఈ ప్రాజెక్ట్ ఆగినట్టేనా అని ఫీలయ్యారు. అయితే వారి ఎదురుచూపులకు తెరదించుతూ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.
`మళ్లీ మొదలైంది. ఈ సారి ముగిద్దాం` అంటూ త్వరలోనే షూటింగ్ పూర్తి చేస్తామని హింట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన కీలక అప్ డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఓ హాలీవుడ్ స్టార్ ఈ మూవీలో భాగం కాబోతున్నాడు. కిల్ బిల్, గాడ్జిల్లా ఫైనల్ వార్స్ వంటి సినిమాల్లో నటించిన జపాన్ నటుడు కజుకి కిటముర `ఓజీ`లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓ కీలక పాత్రలో కజుకి కిటముర కనిపించనున్నారని ఇన్ సైడ్ టాక్.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి, ప్రకాష్‌రాజ్, అభిమన్యు సింగ్‌కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరికి తోడు జపాన్‌నటుడు కజుకి కిటముర కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో ఓజీ పై క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఓటీటీ రైట్స్‌ని భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న ఈ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.