స్పీడ్ పెంచిన కయాదు లోహర్.. లైనప్ అదుర్స్!
2021 లోనే తన కెరియర్ ను మొదలుపెట్టిన కాయాదు లోహర్ 2025లో వచ్చిన డ్రాగన్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది .;
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ భాషతో సంబంధం లేకుండా.. వివిధ భాషలలో వరుస అవకాశాలు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భాషతో పట్టింపు లేకుండా కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తున్న సమయంలో అటు సెలబ్రిటీలు కూడా మంచి ఓరియెంటెడ్ కథలతో పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత కన్నడ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమై ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది కాయాదు లోహర్.
నాలుగేళ్లకే స్టార్ స్టేటస్..
2021 లోనే తన కెరియర్ ను మొదలుపెట్టిన కాయాదు లోహర్ 2025లో వచ్చిన డ్రాగన్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది . అంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడానికి సుమారుగా నాలుగు సంవత్సరాల సమయం పట్టింది అనడంలో సందేహం లేదు. అయితే అలా తక్కువ సమయంలోనే పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ఇప్పుడు పల్లి చట్టంబి అనే మలయాళం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టోవినో థామస్, కాయాదు లోహార్ జంటగా డిజోజోస్ ఆంటోనీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పుడు మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమె తదుపరి సినిమాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరుస సినిమాలతో బిజీగా మారిన కాయాదు లోహర్..
ఈ మధ్యకాలంలో ఆకట్టుకునే వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. అందులో భాగంగానే దుల్కర్ సల్మాన్ తో ఐ యామ్ గేమ్ , నానితో ది ప్యారడైజ్, జీవి ప్రకాష్ కుమార్ తో ఇమ్మోర్టల్ , అధర్వతో ఇదయం మురళి, నివిన్ పౌలీ తారం తో పాటు ఎస్టీఆర్ 49 చిత్రాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి ..ఇక ఇప్పుడు ఇలా వరుస సినిమాలతో తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఒకవేళ ఈ సినిమాలు గనుక మంచి సక్సెస్ అందుకున్నాయి అంటే సౌత్ సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా ఈమె పేరు సొంతం చేసుకుంటుంది. ఏది ఏమైనా కాయాదు లోహర్ ప్రాజెక్టులు చాలా భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమాలతో ఆమె తనను తాను ఎలా మార్చుకుంటుందో చూడాలి.
కాయాదు లోహర్ కెరియర్..
2000 ఏప్రిల్ 11వ తేదీన అస్సాం తేజ్ పూర్ లో జన్మించిన ఈమె మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. 2021లో పూణే ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్ విజేతగా నిలిచింది. అప్పుడే కన్నడ చిత్రం మొగిల్ పేటలో తొలిసారి అవకాశం లభించి నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగులో అల్లూరి అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఫంకీ అనే మరో తెలుగు చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.