కార్తీక్ అడుగు స‌రైన‌దేనా?

క‌ర‌ణ్ జోహార్, కార్తీక్ ఆర్య‌న్ ఇప్పుడో సినిమా కోసం క‌లిసి జ‌త‌క‌ట్ట‌బోతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ను క‌ర‌ణ్ జోహార్ త‌న ఇన్‌స్టాలో షేర్ చేశాడు.;

Update: 2025-04-23 11:30 GMT

క‌ర‌ణ్ జోహార్, కార్తీక్ ఆర్య‌న్ ఇప్పుడో సినిమా కోసం క‌లిసి జ‌త‌క‌ట్ట‌బోతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ను క‌ర‌ణ్ జోహార్ త‌న ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇందులో కార్తీక్ ఆర్య‌న్ ఇంత‌కుముందెన్న‌డూ చూడ‌ని అవ‌తారంలో క‌నిపిస్తున్నాడు. 631 ఏళ్ల పాముగా కార్తీక్ ఇందులో క‌నిపించ‌నున్నాడ‌ని మోష‌న్ పోస్ట‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

ఈ మోష‌న్ పోస్ట‌ర్ లో కార్తీక్ బ్లూ జీన్స్ వేసుకుని కెమెరా వైపుకు వీపు చూపిస్తూ క‌నిపించాడు. ఒక పాముల గుహ లోప‌ల నిల‌బ‌డి, దూరంగా ఉన్న సిటీ వైపు చూస్తున్న కార్తీక్ చ‌ర్మం ఆకుప‌చ్చ‌గా మారుతూ, ఆ త‌ర్వాత పొలుసులు లాగా పాము ఆకృతిలోకి మార‌డం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మోష‌న్ పోస్ట‌ర్ ను బ‌ట్టి ఈ సినిమాలో కార్తీక్ రూపం పాములా మారుతూ ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చేశారు.

వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 14న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నాదానియ‌న్ త‌ర్వాత వ‌చ్చే ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ వేస్తున్న మ‌రో త‌ప్ప‌ట‌డుగ‌ని కొంద‌రంటుంటే, ఈ మోష‌న్ పోస్ట‌ర్ కార్తీక్ ఆర్య‌న్ ఇన్‌స్టాలోని పాత ఫోటో నుంచి త‌యారు చేసిన‌ట్టు అనిపిస్తుంద‌ని మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఇంకొంద‌రు ఫ్యాన్స్ క‌ర‌ణ్ జోహార్, అత‌ని టీమ్ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం మానేశార‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం కార్తీక్ ఆర్య‌న్ సూప‌ర్ స్టార్ కావాలంటే ఇలాంటి స‌గం స‌గం ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం స‌రిపోవ‌ని, మంచి కంటెంట్ తో వ‌స్తేనే కెరీర్ లో ముందుకెళ్ల‌గ‌ల‌డ‌ని సూచిస్తున్నారు. నాగ్‌జిల్లా చూడటానికి కామెడీలా అనిపిస్తున్నా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాలో మూఢ న‌మ్మ‌కాలు లేదంటే కామెడీ ప‌రంగానైనా ఏదొక మ్యాజిక్ జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News