హిట్4.. సోషల్ మీడియా వార్తలే నిజమయ్యాయిగా
హిట్‌వర్స్ లో భాగంగా రిలీజైన హిట్3 సినిమా గురువారం రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది.;
హిట్‌వర్స్ లో భాగంగా రిలీజైన హిట్3 సినిమా గురువారం రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. హిట్3 ప్రమోషన్స్ లో భాగంగా శైలేష్ కొలను ఈ ఫ్రాంచైజ్ హిట్7 వరకు ఉంటుందని హింట్ ఇవ్వడంతో రాబోయే సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే ఇప్పుడు హిట్4 లో ఎవరు నటించనున్నారనే విషయంలో అందరికీ క్లారిటీ వచ్చింది.
హిట్‌వర్స్ లో భాగంగా ఇప్పటికే మూడు సినిమాలు రాగా, ప్రతీ సినిమా ఒక్కో కొత్త యాంగిల్ ను చూపిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. హిట్3 లో నాని హీరో కావడంతో ముందు నుంచే ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక హిట్3 క్లైమాక్స్ లో నెక్ట్స్ రాబోయే సినిమాలో ఎవరు హీరో అనే విషయంలో స్పష్టత ఇచ్చారు.
హిట్4లో తమిళ హీరో కార్తీ లీడ్ రోల్ చేస్తున్నాడు. కార్తీ హిట్4 చేస్తున్నాడని తెలిసినప్పటి నుంచి కొంతమంది ఫ్యాన్స్ సినిమాలో హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేసిన సీన్స్ ను కూడా పసిగట్టారు. ఈ విషయం ముందు నుంచే సోషల్ మీడియాలో వినిపించినప్పటికీ అది కేవలం పుకారేనని అనుకున్నారంతా. కానీ హిట్3 క్లైమాక్స్ చూశాక ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.
అయితే ఎన్ని లీక్స్, పుకార్లు వినిపించినా, హిట్4 లో కార్తీ ఉంటాడనే హింట్ బయటికొచ్చింది మాత్రం హిట్3 రిలీజ్ తోనే. హిట్4 లో కార్తీ నటించడం ఆ ఫ్రాంచైజ్ స్థాయిని మరింత పెంచడం ఖాయం. తమిళంలో పాటూ తెలుగులో కూడా కార్తీకి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో హిట్4కు తమిళంలో కూడా మంచి బజ్ ఏర్పడుతుంది.
హిట్4 లో కార్తీ ఏసీపీ వీరప్పన్ పాత్రలో కనిపించనున్నాడు. ఖాకీ సినిమాలో పోలీస్ గా నటించి మంచి హిట్ అందుకున్న కార్తీ, ఆ తర్వాత ఇప్పుడు మరోసారి పోలీస్ డ్రెస్ లో కనిపించనున్నాడు. మొత్తానికి హిట్4 కోసం హీరోగా కార్తీని ఎంచుకోవడమనేది మాత్రం చాలా మంచి డెసిషన్. ప్రస్తుతం సర్దార్2 చేస్తున్న కార్తీ ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ2 చేయాల్సి ఉంది. మరి హిట్4 ఎప్పుడు చేస్తాడనేది చూడాలి.