చెట్టు పేరు ఆరంభం వరకే!
తాను సినీ కుటుంబంలో జన్మించినందుకు తనకు ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చాయన్నది వాస్తవం అన్నారు.;
నెపోటిజంపై అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఎన్నో ఆరోపణలున్నాయి. బంధు ప్రీతి కారణంగా అవకాశాలన్నీ వాళ్లకే వస్తున్నాయని..కొత్త వాళ్లకు అవకాశాలివ్వడం లేదని ఇండస్ట్రీలో ఇదో విచక్షణగా కొనసాగుతుందని దేశంలో అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉన్న ఆరోపణ. నెపోటిజం కారణంగానే బ్యాక్ గ్రౌండ్ లేని నటులు ఎదిగినా? మనస్తాపానికి గురై మృత్యువాత పడుతున్నారు? ప్రతిభావంతుల్ని తొక్కేస్తున్నారనే ఆరోపణ కూడా చాలా కాలంగా ఉంది. దీనిపై ఇప్పటికే ఎవరి అభిప్రాయాలు వారు పంచుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా నెపోటిజంపై స్పందించారు.
తాను సినీ కుటుంబంలో జన్మించినందుకు తనకు ఎన్నో గొప్ప అవకాశాలు వచ్చాయన్నది వాస్తవం అన్నారు. కానీ పరిశ్రమలో మనుగడ సాధించాలి అన్నా? ఎదగాలి అన్నా కొన్ని విషయాలు తప్పక తెలుసు కోవాలన్నారు. `నెపోటిజం అన్నది చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడానికి మాత్రమే పనికొస్తుందన్నారు. కానీ అదె నెపోటిజం కెరీర్ ని మాత్రం నిర్దేశించలేదన్నారు. `ఒకసారి పరిశ్రమలోకి ఎంటర్ అయిన తర్వాత ట్యాలెంట్ పైనే ఎదగాలి. వెనుక బ్యాక్ గ్రౌండ్ కొన్ని అవకాశాలకే పరిమితం. ఆ తర్వాత ఎలాంటి వారినైనా పరిశ్రమ పక్కన బెడుతుంది.
పరిశ్రమకు మన అవసరం ఉన్నంత వరకే. అవసరం లేదని భావిస్తే ఎంతటి వారైనా ఇక్కడ చేసేదేం? లేదు. వెనక్కి వెళ్లాల్సిందే. ప్రతిభ, స్థిరత్వం, ప్రేక్షకుల ఆదరణ మాత్రమే కెరీర్ ను నిర్ణయిస్తుంది. మీ ఇంటి పేరు..చెట్టు పేరు చెప్పుకుని స్టార్ అవుదామనుకుంటే మాత్రం పనవ్వదని కరీనా హెచ్చరించింది. కరీనా కపూర్ చెప్పింది అక్షర సత్యం. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ట్యాలెంట్..ప్రేక్షకుల ఆదరణ లేకపోతే పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగలేరు. ఇండస్ట్రీ అలాంటి వారికే పరిమితమైతే ? పరిశ్రమలో ఉన్న వాళ్లంతా వాళ్లే అవ్వాలి.
కానీ అన్ని పరిశ్రమల్లోనూ ప్రతిభతో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలు, దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఆరేడేళ్ల కాలంగా పరిశ్రమలో సక్సెస్ అవుతుంది కూడా బయట వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో ప్రతిభా వంతులకు అవకాశాలు పెరిగాయి. క్రియేటివ్ పరంగా ఛాన్సులు మరింతగా కనిపిస్తున్నాయి. నటులుగా కూడా ప్రూవ్ చేసుకోగలిగితే? దర్శక, నిర్మాతలు అవకాశాలు కల్పిస్తున్నారు. మునుపటిలా సమీకరణాల ఆధరాంగా అవకాశాలు ఇవ్వడం లేదు. ప్రతిభకు అదృష్టం కూడా తోడైతే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతున్న రోజులివి.