స్టార్ హీరోయిన్ 25 ఏళ్ల కెరీర్‌ని నడిపించినది?
హిందీ చిత్ర పరిశ్రమలో 25 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, కరీనా కపూర్ ఖాన్ (44) జూన్ 2025లో ది నోడ్ మ్యాగజైన్ ముఖచిత్రాన్ని అలంకరించారు.;
''ఒక నటి నిజమైన కొలత ఇన్‌స్టాగ్రామ్ లైక్‌లు లేదా రెడ్ కార్పెట్ అప్పియరెన్స్ కాదు..క్రాఫ్ట్ నా ఆయుధం'' అని ప్రకటించారు సీనియర్ నటి కరీనా కపూర్ ఖాన్. హిందీ చిత్ర పరిశ్రమలో 25 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, కరీనా కపూర్ ఖాన్ (44) జూన్ 2025లో ది నోడ్ మ్యాగజైన్ ముఖచిత్రాన్ని అలంకరించారు. నిజాయితీగా కరీనా తనను ముందుకు నడిపిస్తున్న సూపర్ పవర్ గురించి, సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఏమి మారిందో కూడా మాట్లాడింది. ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా నటనలో మెరుపులు మెరిపించడంలో వెనక్కి తగ్గని ఈ బ్యూటీ, నటన పరంగా ప్రదర్శించే సామర్థ్యమే నటీనటులకు గౌరవాన్ని పెంచుతాయని అన్నారు.
కభీ ఖుషీ కభీ ఘమ్, జబ్ వి మెట్, క్రూ సహా ఎన్నో చిత్రాలలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను పోషించిన కరీనా ఈ పాత్రలతో తాను వ్యక్తిగతంగా సంతృప్తి చెందానని తెలిపారు. కమర్షియల్ సినిమాలతో పాటు, డిజిటల్ సిరీస్ లకు ప్రాధాన్యతనిస్తున్న బెబో డెప్త్ ఉన్న పాత్రల వైపు ఎక్కువగా ఆకర్షితురాలవుతానని తెలిపింది. నన్ను నేను సవాల్ చేసుకునే, ఉత్తేజపరిచే పాత్రలు చేస్తాను. నేను నా శక్తిని, నా ప్రతిభను, నన్ను నేను కాపాడుకోవాలనుకుంటున్నాను.. అని కూడా బెబో వ్యాఖ్యానించింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, కరీనా చివరిసారిగా క్రూలో కనిపించింది. ఆ తర్వాత సింగం ఎగైన్‌లో కనిపించింది. ఇవి రెండూ 2025లో విడుదలయ్యాయి. తదుపరి దైరాలో కనిపిస్తుంది. మేఘనా గుల్జార్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు.