డైమండ్ మెరుపుల చీర‌లో క్వీన్ వైబ్స్

అవును.. చూడ‌గానే రాణిని త‌ల‌పిస్తోంది. వ‌జ్రంలోని మెరుపులు కెంపుల సొగ‌సు ఆమె మేని విరుపుల్లో క‌నిపిస్తున్నాయి.;

Update: 2025-09-07 05:24 GMT

అవును.. చూడ‌గానే రాణిని త‌ల‌పిస్తోంది. వ‌జ్రంలోని మెరుపులు కెంపుల సొగ‌సు ఆమె మేని విరుపుల్లో క‌నిపిస్తున్నాయి. ఇంత‌కీ ఎవ‌రు ఈ క్వీన్? అంటారా? బర్మింగ్‌హామ్ 2025లో కరీనా కపూర్ ఖాన్ తనదైన అద్భుత సౌంద‌ర్యంతో యువ‌త‌రాన్ని ఆక‌ర్షించింది. ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ వ‌జ్రాల మెరుపుల‌ చీరలో క‌రీనా రారాణిని త‌ల‌పించిందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.


సీక్విన్స్ అండ్ ఫ్లూయిడ్ డిజైన్.. లిక్విడ్-మెటల్ ఫినిషింగ్‌తో అలంకరించిన‌ ఈ చీర క‌రీనా అందాన్ని ప‌దింత‌లు పెంచింద‌ని చెప్పాలి. సాంప్రదాయ చీర‌క‌ట్టుకు త‌గ్గ‌ట్టు బోల్డ్ హాల్టర్-నెక్ బ్లౌజ్‌తో క‌రీనా క్లాసిక్ గా క‌నిపించింది. ఈ ఫోటోల‌కు `బర్మింగ్‌హామ్ 2025` అని క్యాప్షన్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. మెరిసే డైమండ్ చాంద్‌బలి చెవిపోగులు, చ‌క్క‌ని గాజుతో యాక్సెసరైజ్ చేసిన ఈ ఆభరణాలు అందాన్ని మ‌రింత పెంచాయి.


బెబో క‌రీనా ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ ప్ర‌త్యేక‌మైన‌ది! అంటూ కితాబిచ్చేస్తున్నారు యువ‌త‌రం. టైమ్‌లెస్ స్టైల్ ఐకాన్ అనే ప‌దానికి క‌రీనా ఒక సింబ‌ల్. ఈవెంట్ కోసం విచ్చేసిన క‌రీనా బ్లాక్ కార్ నుంచి నేరుగా ల‌గ్జ‌రీ హోట‌ల్ లో అడుగుపెట్టింది. లాంజ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి చూడ‌గానే, భారీ ఫాలోవ‌ర్స్ వీధి పొడ‌వునా క‌నిపిస్తున్నారు. మొత్తానికి పాపుల‌ర్ డైమండ్స్ మ‌ర్చెంట్ కి ప్ర‌చార హంగామా హోరెత్తిపోతోంది. ఎంపిక చేసుకున్న బ్రాండ్ కి బెబో ప‌ర్ఫెక్ట్ యాప్ట్ మోడ‌ల్ అని చెప్పాలి. తైమూర్ అలీఖాన్, జేహ్ జ‌న్మించాక క‌రీనా క‌పూర్ ఖాన్ కొంత కాలం సినిమాల‌కు దూర‌మైంది. కానీ ఇప్పుడు పిల్ల‌లు పెద్ద‌వాళ్ల‌వుతుంటే, తిరిగి న‌టిగా బిజీ అవుతోంది.




Tags:    

Similar News