థియేటర్ or OTT.. కరణ్ జోహార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఐతే థియేటర్ ఓటీటీ ఎక్కడ రిలీజ్ చేయాలన్నది ఎవరు చెప్పలేరు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.;

Update: 2025-08-15 06:14 GMT

ఏ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయాలి.. ఏది ఓటీటీ ఆడియన్స్ కి అందించాలి అన్నది చెప్పడం చాలా కష్టం. తలపండిన క్రియేటర్స్ కూడా ఫలానా సినిమా థియేట్రికల్ హిట్ పక్కా అని చెప్పలేరు. ఎందుకంటే ఒక సినిమాలో ఆడియన్ కి నచ్చిన ఏ పాయింట్ అయినా సరే క్లిక్ అయితే ఆ సినిమా సక్సెస్ కు కారణం అవుతుంది. ఇక థియేట్రికల్ వర్షన్ అంతగా ఆకట్టుకోలేని సినిమాలు కొన్ని ఓటీటీ లో వచ్చాక తెగ చూసేస్తుంటారు. అర్రె ఈ సినిమా థియేటర్ లో ఎలా మిస్ అయ్యామని అని చర్చిస్తారు.

సైయారా విజువల్ గ్రాండియర్..

ఐతే థియేటర్ ఓటీటీ ఎక్కడ రిలీజ్ చేయాలన్నది ఎవరు చెప్పలేరు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా థియేటర్ లో రిలీజ్ చేసే ఆడియన్స్ ని మెప్పించే అంశాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. రీసెంట్ గా సైయారా సినిమా ఆ కథ, విజువల్ గ్రాండియర్, మ్యూజిక్ ఇదంతా కూడా ఆడియన్స్ కు బాగా నచ్చింది. బాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు రావాలన్నది సైయారా చూపించిందని అన్నారు.

ఐతే హై ఇంటెస్ట్ డ్రామా, రొటీన్ సినిమాలు ప్రేక్షకులను థియేటర్ కు తీసుకు రాకపోవచ్చు. ఐతే థియేటర్ లో సినిమా చూసే ప్రేక్షకుడికి ఒక ఫిక్స్డ్ ఫార్ములా అనేది ఏది లేదు. ఈ సినిమా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది అనుకుంటే అది సూపర్ సక్సెస్ అవుతుంది. ధర్మా ప్రొడక్షన్స్ లోనే వచ్చిన కేసరి చాప్టర్ 2 కోర్ట్ రూం డ్రామా కథ అనుకుంటే అది థియేటర్ లో మంచి పర్ఫార్మ్ చేసింది.

స్ట్రాటజీ కనిపెట్టడంలోనే..

ప్రతి సినిమాకు తనదైన జర్నీ ఉంటుంది.. ఐతే అది థియేటర్ ఆడియన్స్ కోసమా.. లేదా ఓటీటీ వారికా అన్నది తెలుసుకోవాలి. ఏది ఏమైనా సరైన ఫ్లాట్ ఫాం దొరికితే ఆడియన్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఐతే ఈ స్ట్రాటజీ కనిపెట్టడంలోనే ఫిల్మ్ మేకర్స్ కు కష్టమని అన్నారు కరణ్ జోహార్.

కరణ్ జోహార్ చెప్పింది దాదాపు నిజమే అని చెప్పొచ్చు. ఎందుకంటే థియేట్రికల్ రిలీజైన ప్రతి సినిమా ఆడుతుందని లేదు. అలా అని ఓటీటీలో ఇస్తే అక్కడ అసలు పట్టించుకోరు. ఐతే ఏదైతే ఎంగేజ్ అవుతుంది అనుకున్న సినిమా మంచి ప్రమోషన్స్ తో వస్తే తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుంది. ఐతే ఓటీటీలో రిలీజై సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో రిలీజ్ ఎక్కడైనా సరే కంటెంట్ బాగుంటే ఆ మూవీ సూపర్ హిట్ అవుతుంది.

Tags:    

Similar News