స్టార్ డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం..!
తన 50వ పుట్టిన రోజున 2022లో కరణ్ జోహార్ యాక్షన్ సినిమాను ప్రకటించాడు. అందుకు సంబంధించిన వర్క్ మొదలు పెట్టినట్లుగా మధ్య మధ్యలో పలు సార్లు ప్రకటనలు చేస్తూ వచ్చాడు.;
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ గత కొన్నాళ్లుగా భారీ యాక్షన్ సినిమాను తీయాలని భావిస్తున్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు, రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌ను కరణ్ జోహార్ రూపొందించాడు. ఆయన బ్యానర్‌లో పలు జోనర్స్ లో సినిమాలు వచ్చాయి. కానీ ఆయన దర్శకత్వంలో మాత్రం యాక్షన్ జోనర్ మూవీ పూర్తి స్థాయిలో రాలేదు. అందుకే ఈసారి ఎలాగైన గట్టి యాక్షన్ సినిమా తీయాలని పట్టుదలతో ప్రకటనలు చేస్తూ వచ్చాడు. తన 50వ పుట్టిన రోజున 2022లో కరణ్ జోహార్ యాక్షన్ సినిమాను ప్రకటించాడు. అందుకు సంబంధించిన వర్క్ మొదలు పెట్టినట్లుగా మధ్య మధ్యలో పలు సార్లు ప్రకటనలు చేస్తూ వచ్చాడు.
'లగ్ జా గేల్' అనే యాక్షన్ మూవీ స్క్రిప్ట్ ను కరణ్ జోహార్ ఎంపిక చేసుకున్నాడు. ఆ కథ నచ్చడంతో దర్శకత్వం చేసేందుకు రెడీ అయ్యాడు. దేబాశిష్ ఇరెంగ్బమ్, పారిజాత్ జోషి రాసిన ఈ యాక్షన్ రొమాంటిక్ రివేంజ్ డ్రామాను తనదైన శైలిలో సినిమాటిక్‌గా మార్చాలని భావించాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సమయంలో ఇలాంటి సమయంలో తాను ఈ ప్రయోగం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదనే నిర్ణయానికి వచ్చాడట. అందుకే సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. యాక్షన్ సినిమా తీయాలనే తన కోరికను ప్రస్తుతానికి పక్కన పెట్టిన కరణ్ జోహార ఆ బాధ్యతను మరో దర్శకుడికి అప్పగించారని తెలుస్తోంది.
గుడ్ న్యూస్, జుగ్ జగ్ జియో వంటి సినిమాలతో దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రాజ్ మెహతాకు 'లగ్ జా గేల్' సినిమా దర్శకత్వ బాధ్యతలను అప్పగించారని తెలుస్తోంది. ఈ దర్శకుడు డెడ్లీ సినిమా ను చేస్తూ కొన్ని కారణాల వల్ల ఆపేశాడు. తాజాగా డెడ్లీ నుంచి పూర్తిగా తప్పుకున్న దర్శకుడు రాజ్ మెహతా కు లగ్ జా గేల్ సినిమా బాధ్యతను ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ అప్పగించారని తెలుస్తోంది. కేవలం దర్శకత్వ బాధ్యతలను మాత్రమే అప్పగించాడని, నిర్మాతగా కరణ్ జోహార్ వ్యవహరిస్తాడని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయమై కథనంను ప్రచురితం చేయడంతో కరణ్ జోహార్ నుంచి సైతం కన్ఫర్మేషన్ వచ్చినట్లు అయింది.
ఈ భారీ యాక్షన్ రొమాంటిక్ మూవీలో హీరోగా బాలీవుడ్ యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ను నటింపజేస్తున్నారు. యాక్షన్ సినిమాలకు ఆయన మోస్ట్ వాంటెడ్ అనే విషయం తెల్సిందే. అంతే కాకుండా హీరోయిన్‌గా ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ను నటింపజేస్తున్నారు. వీరిద్దరి కాంబో ఖచ్చితంగా యాక్షన్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు మంచి స్పందన లభిస్తుంది. కనుక ఈ సినిమాను ప్రేక్షకులు నచ్చే విధంగా రూపొందిస్తే కచ్చితంగా భారీ వసూళ్లను కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.