అలా అయితే ప్రతీ స్టార్ కిడ్ సక్సెస్ అవాలి
బాలీవుడ్ లో లాంటి నటనా ఆధారిత ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్ ను రాజీ లేని స్కిల్స్ గా చూస్తారని, స్టార్ కిడ్స్‌పై ఇలాంటి విమర్శలు ఇంకా ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నాడు.;
ఖుషీ కపూర్ మరియు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ పెర్ఫార్మెన్స్‌ల చుట్టూ పెరుగుతున్న విమర్శల గురించి ది స్పిల్ బి రీసెంట్ ఎపిసోడ్ లో కరణ్ జోహార్ మాట్లాడాడు. వాళ్లు చిన్న వాళ్లైనప్పటికీ సమస్యలు, ఎదురుదెబ్బలను అధిగమించి అభివృద్ధి చెందుతున్నారని, కేవలం ఒక్క సినిమా వారి కెరీర్ ను డిసైడ్ చేయదని, వారసత్వం కేవలం సెలబ్రిటీ స్టేటస్‌ను మాత్రమే కాకుండా వారిపై ఒత్తిడిని కూడా తెస్తుందని అన్నాడు.
బాలీవుడ్ కు ముందు కావాల్సింది మంచి నటన మరియు ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే లక్షణాలే అని, ఈ రోజుల్లో కొత్తవాళ్లను కూడా ఇంటర్నెట్ వదిలిపెట్టడం లేదని ఆయన అన్నారు. వృషభ సినిమాలో మోహన్ లాల్ సరసన నటిస్తున్న షనాయా కపూర్ ఇప్పటికే సంచలనం సృష్టించిందని, మొదటి దశలోనే షనాయా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకుందని, కానీ వైరల్ అయిన ఓ డ్యాన్స్ క్లిప్ ను చూసి కొరియోగ్రఫీ ఫ్లాట్ గా ఉందని, చెప్పుకోదగ్గ రీతిలో ఆమె డ్యాన్స్ లేదని షనాయాను ట్రోల్ చేశారన్నాడు.
బాలీవుడ్ లో లాంటి నటనా ఆధారిత ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్ ను రాజీ లేని స్కిల్స్ గా చూస్తారని, స్టార్ కిడ్స్‌పై ఇలాంటి విమర్శలు ఇంకా ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నాడు. ఆమిర్ ఖాన్ కూడా రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్ లో లవ్ యాపా ఫ్లాప్, అతని కొడుకు జునైద్ ఖాన్ అరంగేట్రంపై వచ్చిన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. నెపోటిజం కచ్ఛితంగా హిట్ ను ఇస్తే, ప్రతీ స్టార్ కిడ్ సక్సెస్ అవుతాడని, కానీ ఆ వార్తలన్నీ నిజం కాదని ఆమిర్ చెప్పాడు. జునైద్ ఖాన్ కు ప్రశంసలు వచ్చేది తను పడిన కష్టం కారణంగానే కానీ తన ఇంటి పేరు కారణంగా కాదని అన్నాడు.
అయితే నెపోటిజం, వారసత్వం అనేది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికొస్తాయని, దాని వల్ల ప్రశంసలు రావనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రీ ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, టాలెంట్ ఉంటే అది ఎప్పటికీ సెకండ్ ఛాన్స్ ను ఇవ్వడానికి రెడీగా ఉంటుందనేది వాస్తవం.