కాంతార ప్రీక్వెల్ ఎఫెక్ట్.. గట్టి డిమాండ్ ఉన్నట్లు ఉందే..
ఇప్పుడు టాలీవుడ్ లో అరవింద్ కశ్యప్ కు మంచి ఆఫర్స్ వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అనేక సినిమాల మేకర్స్ ఆయనను సంప్రదిస్తున్నారని సమాచారం.;
బ్లాక్ బస్టర్ హిట్ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రూపొందిన కాంతార చాప్టర్ 1 రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. జానపద కథ, దైవిక అంశాలతో తెరకెక్కిన ఆ సినిమా.. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. విడుదల అయిన అన్ని సెంటర్స్ లో కూడా అన్ని వర్గాల ఆడియన్స్ ను విపరీతంగా మెప్పిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తొలి రోజు రూ.89 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన కాంతార ప్రీక్వెల్.. రెండో రోజు కూడా భారీ కలెక్షన్లు సాధించడం విశేషం. ఇప్పుడు వీకెండ్ కావడంతో మరిన్ని వసూళ్లను మూవీ రాబట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది.
అదే సమయంలో లీడ్ రోల్ లో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా నటించారని, డైరెక్ట్ కూడా అంతే విధంగా చేశారని చెబుతున్నారు. నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయని అంటున్నారు. టెక్నీషియన్స్ అందరూ బాగా వర్క్ చేశారని కామెంట్లు పెడుతున్నారు.
సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదని అంటున్నారు. అయితే తన అద్భుతమైన కెమెరా పనితనంతో ప్రేక్షకులను, విమర్శకులను విపరీతంగా ఆకట్టుకున్నారు సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్. దీంతో సర్వత్రా ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. వర్క్ ఓ రేంజ్ లో ఉందని అంతా కొనియాడుతున్నారు.
ఇప్పుడు టాలీవుడ్ లో అరవింద్ కశ్యప్ కు మంచి ఆఫర్స్ వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అనేక సినిమాల మేకర్స్ ఆయనను సంప్రదిస్తున్నారని సమాచారం. రెమ్యునరేషన్ కూడా సాలిడ్ గా ఇస్తామని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా గోపిచంద్ మలినేని ఆయనను సంప్రదించారని వినికిడి.
అయితే గోపిచంద్ మలినేని.. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో వర్క్ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్స్ జరుపుతుండగా.. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అరవింద్ కశ్యప్ ను టీమ్ లో తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఆయనతోపాటు మరికొందరు డైరెక్టర్స్ కూడా అప్రోచ్ అయ్యారని టాక్.