స్టార్ సింగర్ దిల్జిత్ తో రిషబ్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

కాంతార: చాప్టర్ 1 చిత్రంతో అద్భుతమైన హిట్ అందుకున్న రిషబ్ శెట్టి తాజాగా తన సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు.;

Update: 2025-10-04 18:30 GMT

కాంతార: చాప్టర్ 1 చిత్రంతో అద్భుతమైన హిట్ అందుకున్న రిషబ్ శెట్టి తాజాగా తన సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా ఈ సినిమాకి హిందీ వెర్షన్ లో ఓ పాట పాడడం కోసం ప్రముఖ గాయకుడు దిల్జిత్ ని ఎలా తీసుకున్నారు? ఆయనతో ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాన్ని కూడా బయటపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్జిత్ దోసాంజ్ గురించి మాట్లాడుతూ.. "కాంతార: చాప్టర్ 1 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న టైంలో స్పెషల్ గా ఒక గాయకుడిని తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాం. ఆ సమయంలో నాకు దిల్జిత్ గుర్తుకు వచ్చారు. కానీ ఆయన పేరు గుర్తురాకా ఇబ్బంది పడ్డాను.

ఆ తర్వాత కాంతార: చాప్టర్ 1 కోసం దిల్జిత్ ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ తో ఈ విషయాన్ని చెప్పాను. మనం అనుకున్న పాటకి దిల్జిత్ వాయిస్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అని చెప్పాను. దాంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఒప్పుకున్నారు. ఆ తర్వాత వెంటనే నేను ఆయన మేనేజర్ ని సంప్రదించగా.. దిల్జిత్ తన మిగతా షోలను రద్దు చేసుకొని కాంతార సినిమా చూడడానికి తన టీంతో కలిసి వెళ్ళారు అని చెప్పారు.

ఆ సమయంలోనే కాంతార సినిమా పట్ల దిల్జిత్ కి ఉన్న ఇష్టం నాకు తెలిసింది. ఆ తర్వాత నాలుగు రోజులకు దిల్జిత్తు తన టీం తో కలిసి ఈ సినిమాలో "బోలే రే కాంతార" పాటను రికార్డింగ్ చేయడానికి YRF కి వచ్చారు. రికార్డింగ్ పూర్తయిన తర్వాత దిల్జిత్ నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పాడు. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య సంభాషణ నాలుగైదు నిమిషాల్లోనే మా మధ్య ఉన్న బాండింగ్ ను కూడా బయట పెట్టేలా చేసింది. నేను, దిల్జిత్ శివ భక్తులం అని కూడా తెలిసింది. ఆ బంధమే మమ్మల్ని ఈ సినిమా కోసం మరింత గట్టిగా పని చేయడానికి ప్రోత్సహించింది. అలా బోలే రే కాంతార అనే పాటని కాంతార: చాప్టర్ 1 హిందీ వర్షన్ కి పాడించాం. దిల్జిత్ ని కాంతార సినిమాకి వర్క్ చేసేలా ఆ దైవిక శక్తే ఆయన్ని నడిపించింది. మా ఇద్దరినీ ఒకచోట చేర్చింది" అంటూ రిషబ్ శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

అలాగే కాంతార సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో దిల్జిత్ మాట్లాడుతూ.. "కాంతార సినిమాతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆ సినిమా స్క్రీన్ పై చూసినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాను. ముఖ్యంగా "వరాహ రూపం దైవ వ రిష్టం" అనే పాట పెద్ద స్క్రీన్ పై చూసినప్పుడు ఆనందంతో ఏడ్చేశాను. ఆ తర్వాత కాంతార: చాప్టర్ 1 కోసం రెబల్ సాంగ్ యొక్క హిందీ వర్షన్ ని పాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను "అంటూ దిల్జిత్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

Tags:    

Similar News