కాంతార ప్రీక్వెల్.. 'దసరా' రికార్డులు బద్దలయ్యాయా?

ఇప్పుడు అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. సినిమా అంచనాలకు తగ్గట్టు ఉందని అనేక మంది మూవీ లవర్స్ సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు.;

Update: 2025-10-03 05:40 GMT

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 సినిమా రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ నటిస్తూ.. దర్శకత్వం వహించారు. సౌత్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ గ్రాండ్ గా రూపొందించారు.

రుక్మిణి వసంత్ హీరోయిన్‌ గా నటించగా.. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు. అయితే కాంతార చిత్రం భారీ విజయం సాధించడంతో ప్రీక్వెల్ పై కూడా ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. వాటి మధ్యే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పుడు అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. సినిమా అంచనాలకు తగ్గట్టు ఉందని అనేక మంది మూవీ లవర్స్ సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. దీంతో భారీ వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియాలో కాంతార ప్రీక్వెల్.. అన్ని భాషల్లో కలిపి తొలి రోజు పెద్ద ఎత్తున వసూళ్లను సాధించినట్లు ప్రచారం జరుగుతోంది.

రూ.60 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టినట్లు టాక్ వినిపిస్తోంది. తద్వారా ఇప్పటి దసరా సీజన్ లో నమోదైన రికార్డులను ఓపెనింగ్స్ తో కాంతార చాప్టర్ 1 మూవీ బ్రేక్ చేసినట్లు సమాచారం. దీంతో కాంతారలాగా.. ఇప్పుడు ప్రీక్వెల్ కూడా కొత్త రికార్డులు సాధించేలా కనిపిస్తుందని పలువురు నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

తొలి రోజు భారత్ లో రూ.60 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుండగా.. హిందీ వెర్షన్ రూ.19.5 కోట్లు, కన్నడ వెర్షన్ రూ.18 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.12.5 కోట్లు, తమిళ వెర్షన్ రూ.5.25 కోట్లు, మలయాళ వెర్షన్ రూ.4.75 కోట్లు రాబట్టినట్లు సమాచారం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కాంతార ప్రీక్వెల్ మూవీ రూ.70 కోట్లు వసూలు చేసినట్లు టాక్.

అయితే తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 మూవీకి రూ.100 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో రూ.169 కోట్ల, కేరళలో రూ.20 కోట్లు, నార్త్ లో రూ.96 కోట్లు, తమిళనాడులో రూ.13 కోట్ల బిజినెస్ జరిగినట్లు వినికిడి. అలా వరల్డ్ వైడ్ గా రూ.440 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి బ్రేక్ ఈవెన్ ఎప్పుడు సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News