కాంతార చాప్టర్ 1.. బుక్ మై షోలో ఊచకోతే!
కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమా క్రేజ్ కు తగ్గట్లే దూసుకుపోతుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు రికార్డుల జాబితాలో కొత్త పేజీ తెరిచింది.;
కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమా క్రేజ్ కు తగ్గట్లే దూసుకుపోతుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు రికార్డుల జాబితాలో కొత్త పేజీ తెరిచింది. దసరా సీజన్‌కి రిలీజ్ అయిన ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామా.. నాలుగు రోజుల్లోనే మరో అద్భుత ఫీట్ సాధించింది.
బుక్ మై షోలో ఈ సినిమాకు ఇప్పటివరకు మొత్తం 5.8 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ప్రీ సేల్స్‌లోనే 9.16 లక్షల టిక్కెట్లు వెళ్లిపోగా.. మొదటి రోజు నుంచి ఇలా ఉన్నాయి.
మొదటి రోజు 1.28 మిలియన్,
రెండో రోజు 1.27 మిలియన్,
మూడో రోజు 1.30 మిలియన్,
నాలుగో రోజు 1.04 మిలియన్
ఇప్పటివరకు మొత్తం 5.8 మిలియన్
ఇంత భారీగా టిక్కెట్లు అమ్ముడవడం కన్నడ సినిమాలకు అరుదైన ఘనత. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో టిక్కెట్ సేల్‌లో రికార్డులను తిరగరాస్తోంది. వీకెండ్ లో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ హౌస్‌ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ ఊపందుకుంది.
దసరా సెలవులు, వర్డ్ ఆఫ్ మౌత్ కలయికతో కాంతార చాప్టర్ 1 రన్ ఇంకా వేగంగా కొనసాగుతోంది. మల్టిప్లెక్స్‌ల నుండి సింగిల్ స్క్రీన్‌ల వరకు ఎక్కడ చూసినా ప్రేక్షకుల సందడి కనిపిస్తోంది. కేవలం దక్షిణ రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తర భారతదేశంలో కూడా ఈ సినిమాకు ఆదరణ పెరిగింది.
ఇక ఓవర్సీస్‌లో కూడా కాంతార చాప్టర్ 1 కలెక్షన్లు అదిరిపోతున్నాయి. మొదటి వారాంతానికే రెండు మిలియన్ డాలర్లు దాటేసింది. బుక్ మై షో రికార్డులతో పాటు, మొత్తం థియేట్రికల్ గ్రాస్ 250 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం రెండూ కలిసి మ్యాజిక్ క్రియేట్ చేశాయి. అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో లెవెల్ ఇచ్చింది. మొత్తంగా చూసుకుంటే, కాంతార చాప్టర్ 1 ఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్లు సృష్టిస్తున్న చిత్రం అని చెప్పొచ్చు. ఈ స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందని నెటిజన్లు చెబుతున్నారు.