కాంతార: చాప్టర్1 టీమ్ కు మరో ప్రమాదం
రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా 2022లో రిలీజై బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.;
రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా 2022లో రిలీజై బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో కాంతారకు ప్రీక్వెల్ గా కాంతార: చాప్టర్1ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను కూడా రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఏ ముహూర్తాన కాంతార1 మొదలైందో కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఏదొక రూపంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతుండగా, చిత్ర యూనిట్ మొత్తం బోటులో వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ఆ బోటు బోల్తా పడింది. బోల్తా పడిన బోటులోనే కెమెరామెన్, రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.
బోల్తాపడిన ఆ బోటులో 30 మంది ఉండగా, అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పడవ బోల్తా పడ్డాక అందులోని వారంతా నీటిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మాణి జలాశయం వద్ద కాంతార1 షూటింగ్ ను 15 రోజుల పాటూ చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు బోటు మునిగిపోవడంతో కెమెరా సహా అందులోనే ఉండటం వల్ల షూటింగ్ వాయిదా పడింది.
వరాహి నది వెనుక ఏరియాలో కాంతార1 షూటింగ్ జరుగుతుండగా అక్కడికి చేరుకునే క్రమంలో బోటు బోల్తా పడినట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత షూటింగ్ ను నిలిపివేసి, అక్కడే యడూరు దగ్గరలోని ఓ రిసార్ట్ లో చిత్ర యూనిట్ రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా జరిగాయి. ఇలా వరుస ప్రమాదాలు జరగడమేంటని చిత్ర యూనిట్ ఆలోచనలో పడింది.