'కాంతార' 1000 కోట్లు.. ఎంత ఇంపార్టెంట్ అంటే..

'కాంతార చాప్టర్ 1' ఈ ఏడాది బాక్సాఫీస్‌కు దొరికిన అసలైన వజ్రం. 2025లో మరే సినిమా క్రియేట్ చేయలేని ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది.;

Update: 2025-10-26 08:38 GMT

'కాంతార చాప్టర్ 1' ఈ ఏడాది బాక్సాఫీస్‌కు దొరికిన అసలైన వజ్రం. 2025లో మరే సినిమా క్రియేట్ చేయలేని ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసింది. ఇండియాలోనే కాదు, గ్లోబల్‌గా ఆడియెన్స్‌ను ఊపేసింది. మొన్నటిదాకా టాప్ ప్లేస్‌లో ఉన్న 'ఛావా' లాంటి భారీ హిట్‌ను కూడా దాటేసి, ఈ ఇయర్‌కి నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచింది. రిషబ్ శెట్టి విజన్‌కు, ఆ మట్టి కథకు ప్రపంచం ఫిదా అయిపోయింది.

ప్రస్తుతం ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర 818 కోట్ల రూపాయల దగ్గర స్ట్రాంగ్‌గా ఉంది. ఇది అన్‌బిలీవబుల్ సక్సెస్. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లు సాధించడం ఒక చరిత్ర. నిజానికి మేకర్స్ ఇప్పుడు ఫుల్లుగా పార్టీ చేసుకోవచ్చు. కానీ, వాళ్లు మాత్రం ఇంకా రిలాక్స్ అవ్వడం లేదు. వాళ్ల చూపు మరో పెద్ద రికార్డ్ మీద పడింది. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా సీరియస్‌గా ట్రై చేస్తున్నారు.

ఆ టార్గెట్ మరేదో కాదు, ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎలైట్ క్లబ్ అయిన 'వెయ్యి కోట్ల క్లబ్'. అయితే, ఈ 1000 కోట్ల టార్గెట్ వెనుక కేవలం డబ్బు, రికార్డులు మాత్రమే లేవు. దీనికి అసలు కారణం 'కాంతార చాప్టర్ 2'. అవును, 'చాప్టర్ 1'ని మించి, 'చాప్టర్ 2' కథను రిషబ్ శెట్టి చాలా పెద్ద స్పాన్‌లో, భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఆ కథకు భారీ బడ్జెట్ అవసరం.

'కాంతార చాప్టర్ 1' కనుక ఈ 1000 కోట్ల మార్కును టచ్ చేస్తే, ఆ ఫ్రాంచైజ్ బ్రాండ్ వాల్యూ నెక్స్ట్ లెవల్‌కు వెళ్ళిపోతుంది. అది కేవలం 'బ్లాక్‌బస్టర్' కాదు, 'గ్లోబల్ ఫినామినా'గా ముద్ర పడుతుంది. ఈ ట్యాగ్ ఉంటే, 'చాప్టర్ 2'కి బడ్జెట్ విషయంలో ఎలాంటి లిమిట్స్ ఉండవు. ప్రొడ్యూసర్స్ వెనకాడకుండా ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. ఆ విజువల్స్, ఆ స్పాన్‌ను వరల్డ్ క్లాస్ లెవల్‌లో తీయడానికి రిషబ్ శెట్టికి పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది.

అయితే, ఈ 1000 కోట్ల ప్రయాణానికి ఇప్పుడు పెద్ద అడ్డంకి ఎదురైంది. మరో వారంలోనే ఈ సినిమా సౌత్ భాషల్లో ఓటీటీలోకి వస్తుందనే గట్టి టాక్ నడుస్తోంది. అదే జరిగితే, థియేట్రికల్ రన్ ఆగిపోతుంది. అందుకే మేకర్స్ టైమ్‌తో రేస్ పెట్టుకున్నారు. ఓటీటీ రిలీజ్‌కు ముందే, సరిగ్గా మరో ఐదు రోజుల్లో ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్‌ను గ్లోబల్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇది వాళ్లు ఆడుతున్న అతి పెద్ద గేమ్.

ఈ 180+ కోట్ల గ్యాప్ ఫిల్ చేయడానికి వాళ్లు వేసిన స్కెచ్ ఇదే. ఈ ఇంగ్లీష్ వెర్షన్ క్లిక్ అయితే, ఆ 1000 కోట్ల మార్క్ ఈజీగా క్రాస్ అవుతుంది. ఆ దెబ్బతో, 'కాంతార చాప్టర్ 2' బడ్జెట్, స్కేల్ మొత్తం మారిపోతాయి. అది కేవలం పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమాగా రావడం ఖాయం. అందుకే ఈ చివరి పుష్ కోసం టీమ్ ఇంతలా ఫైట్ చేస్తోంది.

Tags:    

Similar News