• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కన్నప్ప మూవీకి యోగి...

కన్నప్ప మూవీకి యోగి ఆశీర్వాదం.. రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..

| తెలుగు సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కన్నప్ప” సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్ ఎట్టకేలకు అధికారికంగా బయటకు వచ్చింది

By - Tupaki Desk
Update: 2025-04-09 12:06 GMT

తెలుగు సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కన్నప్ప” సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్ ఎట్టకేలకు అధికారికంగా బయటకు వచ్చింది. అసలైతే ఏప్రిల్ లోనే విడుదల కావాలి. కానీ పలు కారణాల వలన డేట్ మార్చాల్సి వచ్చింది. ఇక ఈ చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను భేటీ అయ్యింది. అలాగే ప్రత్యేకంగా సినిమా పోస్టర్‌ను విడుదల చేయించడంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దర్శకుడు మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, నిర్మాత వినయ్ మహేశ్వరి తదితరులు యోగి అదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి, సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతి, భక్తి తత్వాన్ని ప్రదర్శించేలా ఈ సినిమా ఉండబోతుందని తెలిసి ఎంతో హర్షించారని సమాచారం.

ఈ సందర్భంలో జూన్ 27న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. విజయవంతమైన హిందూ ఆధ్యాత్మిక చిత్రాల సరసన నిలవబోయే ఈ సినిమా కోసం ఇప్పుడే అంచనాలు ఊపందుకున్నాయి. “కన్నప్ప” సినిమా ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ప్రత్యేకతను చాటుకుంటూనే వచ్చింది. పవిత్రమైన భావజాలం, భారీ తారాగణం, పాన్ ఇండియా ప్రమాణాల్లో తెరకెక్కే ఈ చిత్రంలో మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.

ముఖ్యంగా ప్రభాస్ పాత్ర ఓ హైలైట్‌గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఆధ్యాత్మికతను, యాక్షన్‌ను పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తూ ఈ చిత్రం రూపొందుతోంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్నీ హై స్టాండర్డ్స్‌తో ఉంటాయని సమాచారం.

ఈ సినిమా పోస్టర్‌ను యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా విడుదల చేయడం ద్వారా హిందీ రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై బజ్ పెరిగింది. ఉత్తర భారతదేశంలో కూడా ఈ చిత్రానికి మంచి మార్కెట్ ఉండేలా సినిమా టీమ్ వ్యూహాత్మకంగా ప్రమోషన్స్ చేస్తోంది. జూన్ 27న గ్రాండ్ లెవెల్లో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు మరో గర్వకారణంగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. భక్తితో పాటు పవర్ఫుల్ అడ్వెంచర్‌ను చూపించబోతున్న ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని యూనిట్ చెబుతోంది.

Tags:    
  • Kannappa 
  • VishnuManchu 
  • MythologicalEpic 
  • Tollywood 
  • IndianCinema 
  • PanIndiaFilm 
  • Mohanlal 
  • AkshayKumar 
  • Prabhas 
  • KajalAggarwal 
  • MohanBabu 
  • Filmindustry 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS