టాలీవుడ్ లో శాండల్ వుడ్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డ్..
అందులో ఒకటి కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ 2 కాగా.. మరొకటి కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1. 2022 ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 ఎలాంటి హిట్ అయిందో తెలిసిందే.;
టాలీవుడ్ మూవీ లవర్స్ రూటే వేరు. కేవలం తెలుగు సినిమాలే చూడాలని ఎప్పుడు అనుకున్నారు. తమ సినిమాలతోపాటు ఇతర భాషల చిత్రాలు కూడా చూస్తారు. భాషతో సంబంధం లేకుండా వివిధ సినిమాలను వీక్షిస్తారు. అంతే కాదు.. కంటెంట్ బాగుంటే.. భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. చెప్పాలంటే.. బ్రహ్మరథం కూడా పడతారు.
అందుకే బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ కు చెందిన అనేక సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ తెలుగులో ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుంటాయి. కొందరు హీరోలవి అయితే ప్రతి మూవీ కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. అంతలా తెలుగులో మిగతా భాషలకు చెందిన అనేక మంది హీరోలు మార్కెట్ ను సంపాదించుకున్నారని చెప్పాలి.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లో శాండల్ వుడ్ అరుదైన ఘనత సాధించింది. తెలుగులో రెండు రూ.100 కోట్ల వసూళ్లను సాధించిన ఏకైక పరిశ్రమగా కన్నడ చిత్ర సీమ నిలిచింది. ఇప్పటి వరకు తమిళ, హిందీ, మలయాళం సినిమాలు బోలెడు రిలీజ్ అయినా ఆ మార్క్ ను అందుకోలేదు. కానీ కన్నడకు చెందిన రెండు సినిమాలు రూ.100 కోట్లు సాధించాయి.
అందులో ఒకటి కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ 2 కాగా.. మరొకటి కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1. 2022 ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 ఎలాంటి హిట్ అయిందో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను సాధించింది. కేవలం తెలుగులోనే రూ.100 కోట్ల వసూళ్లను సాధించి సత్తా చాటింది. మేకర్స్ కు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అందించింది.
ఇప్పుడు .కాంతార చాప్టర్ 1 తెలుగులో 100 కోట్ల వసూళ్లు మార్క్ ను టచ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. అయితే తెలుగు మార్కెట్ లో కన్నడ సినిమాలు రెండు రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేయడమంటే మామూలు విషయం కాదని నెటిజన్లు, సినీ ప్రియులు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు.
అదే సమయంలో కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతార చాప్టర్ 1.. తెలుగులో భారీ వసూళ్లు సాధించాయంటే దాని ఒకే ఒక్క రీజన్ కంటెంట్. రిలీజ్ కు ముందు రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నా.. ప్రమోషన్స్ బాగా చేసినా.. మేకర్స్ ఇచ్చిన కంటెంట్ కు అంతా ఫిదా అయ్యారు. దీంతో రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి.