మినీ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య మీనన్..

ఆ తర్వాత కన్నడలో వచ్చిన దశవాల అనే సినిమాలో వికలాంగురాలి పాత్రలో నటించడంతో ఐశ్వర్య మీనన్ కన్నడ లో ఫేమస్ అయ్యింది.;

Update: 2025-10-07 20:30 GMT

తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా మినీ డ్రెస్ లో తన అందాలను ఆరబోసింది... వైట్ కలర్ టాప్ తో బుల్లి నిక్కర్ లో మెరిసింది.. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ మినీ డ్రెస్ లోని అందాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. ఈమె గ్లామర్ ఫోజులకు నెటిజన్స్ మంత్ర ముగ్ధులవుతున్నారు. అంతేకాదు ఈ హీరోయిన్ ఫోటోలకు అద్భుతమైన కామెంట్లు పెడుతూ.. ఆమె అందాలపై కవిత్వాలు రాసినట్లుగా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మరి కొంతమంది హాట్ అంటూ.. ఫైర్ ఏమోజీల రూపంలో కామెంట్లు పెడుతున్నారు.


ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ ఈ మినీ డ్రెస్ లో వివిధ భంగిమలతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో అందాలను అరబోస్తూ అభిమానులను అబ్బురపరుస్తోంది. ఐశ్వర్య మీనన్ సినిమాలు, కెరియర్ విషయానికి వస్తే.. తమిళనాడులో పుట్టి పెరిగిన ఐశ్వర్య మీనన్ తమిళ కామెడీ మూవీ కాదలిల్ సోదప్పువదు యెప్పడి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమాతో గుర్తింపు రాలేదు.


ఆ తర్వాత కన్నడలో వచ్చిన దశవాల అనే సినిమాలో వికలాంగురాలి పాత్రలో నటించడంతో ఐశ్వర్య మీనన్ కన్నడ లో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా నేర్ ఎథిర్, నమో భూతాత్మ, మన్సూన్ మామిడి పండ్లు, వీర, తమిళ పదం-2, నాన్ సిరితాళ్, వేళం వంటి తమిళ,కన్నడ, మలయాళ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో నిఖిల్ హీరోగా వచ్చిన స్పై మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా థియేటర్లోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడంతో ఈ హీరోయిన్ కి టాలీవుడ్ లో గుర్తింపు రాలేదు.


ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా వచ్చిన భజే వాయువేగం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే తెలుగులో ఐశ్వర్య మీనన్ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ టాలీవుడ్ లో ఈమె చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఐశ్వర్య కి టాలీవుడ్ లో ఆదరణ కరువైంది. ఈ హీరోయిన్ చేతిలో ప్రస్తుతం టాలీవుడ్ లో నాగబంధం అనే సినిమా ఉంది. అభిషేక్ నామా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో విరాట్ కర్ణ హీరోగా..నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

Tags:    

Similar News