రాహుల్ గాంధీతో పెళ్లి వార్తలపై క్వీన్ ఘాటు స్పందన!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మీడియాలో నిత్యం హాట్ టాపికే. ఏదో అంశం విషయంలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది.;
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మీడియాలో నిత్యం హాట్ టాపికే. ఏదో అంశం విషయంలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వివాహం చేసుకోవడానికి కంగనా అంగీకరించిందంటూ కొన్ని రోజులుగా నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ఈ ప్రచారాన్ని లైట్ తీసుకున్న కంగన ఇక సైలెంట్ గా లాభం లేదనుకున్న అమ్మడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.
`అసత్య వార్తలను వ్యాప్తి చేసే వారికి కనీసం సిగ్గు ఉండాలి` అంటూ ఘాటుగా మండిపడ్డారు. తన పేరును ఉపయోగించి ఇలాంటి వార్తలను పుట్టించడం నీచమైన చర్య గా అభివర్ణించారు. ఏమాత్రం వాస్తవం లేని ఇలాంటి విషయాలను ప్రజలు నమ్మవద్దు అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంగనా రనౌత్ తన భావాలను నిక్కచ్చిగా పంచుకుంటారు. రాజకీయంగా ఆమెకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న సిద్ధాంత పరమైన విభేదాలు అందరికీ తెలిసినవే. అలాంటిది రాహుల్ గాంధీతో పెళ్లి అనే వార్త కేవలం తనను ఇబ్బంది పెట్టడానికి , సోషల్ మీడియాలో అటెన్షన్ పొందడానికి ఎవరో కావాలని చేసిన కుట్రగా ఆమె భావిస్తున్నారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలు తన వ్యక్తిత్వాన్నే కాకుండా అవతలి వ్యక్తి గౌరవాన్ని కూడా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. నేటి కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిందని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీ గురించి ఏదైనా చిన్న అబద్ధం చెబితే అది నిమిషాల్లో లక్షల మందికి చేరుతోందని, దానివల్ల సదరు వ్యక్తి మానసిక ప్రశాంతత కోల్పోతారని అన్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇలాంటి పెళ్లి వార్తలు, వ్యక్తిగత పుకార్లు పుట్టించడం అనేది కొందరికి ఫ్యాషన్‌గా మారిపోయిందని ఎండగట్టారు.
ఈ సందర్భంగా కంగనా అభిమానులకు ఓ విజ్ఞప్తి కూడా చేశారు. అధికారిక సమాచారం లేకుండా వచ్చే ఏ వార్తనైనా గుడ్డిగా నమ్మవద్దని వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని కోరారు. నిజానిజాలు తెలుసుకోకుండా ట్రోల్ చేసే వారు సమాజానికి హానికరమని హెచ్చరించారు. తనపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని అరికట్టడానికి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోనని పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
కంగనా రనౌత్ తనపై వస్తోన్న పుకార్లకు చెక్ పెట్టడం తో మరోసారి ధైర్యాన్ని చాటుకున్నారు.
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం అనేది బహిరంగ చర్చకు దారి తీసినా? అందులో నిజాయితీ ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీతో పెళ్లి వార్తలను కొట్టిపారేయడంతో ఈ వివాదానికి తెరదించినట్లయింది. ప్రస్తుతం కంగన బీజీపీ పార్టీ నుంచి ఎంపీ గా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.