కంగనా సంచలన నిర్ణయం
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.;
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఉండటం వల్ల ఆమె కాస్త సైలెంట్‌గా ఉంది కానీ, సినిమా ఇండస్ట్రీలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత పెద్ద స్టార్స్ అయినా పట్టించుకోకుండా తన మనసులో ఉన్నది అనేస్తుంది. ఇండస్ట్రీలో పెద్ద మాఫియా ఉందని సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా మొత్తం అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న కంగనా రనౌత్, సినిమా ఇండస్ట్రీలో తనను తీవ్రంగా తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఆరోపణ సైతం చేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో హీరో స్థాయిలో సత్తా చాటిన కంగనా రనౌత్ ఎంతో మంది పెద్ద హీరోలతో సున్నం పెట్టుకుంది.
కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ ఎంపీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పకనే చెప్పింది. తన మనస్థత్వంకు పెళ్లి సెట్ కాదు అంది. తాను ఓపెన్‌గా మాట్లాడుతాను అని, తన భాగస్వామితో అలా ఉండటం సెట్ కాకపోవచ్చు అంది. జీవితంలో తనకు అనువైన వ్యక్తి తారసపడ్డప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటూ గతంలో చాలా సార్లు చెప్పిన కంగనా ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకోను అంటూ చెప్పడం ద్వారా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ఖచ్చితంగా ఆమె తీసుకున్న నిర్ణయాల్లో అతి పెద్ద నిర్ణయం అనడంలో సందేహం లేదు. ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది విమర్శలు చేస్తున్న వారు కూడా ఉన్నారు.
పెళ్లి పై కంగనా షాకింగ్ వ్యాఖ్యలు
వైవాహిక జీవితం అనేది ప్రతి మనిషికి ఖచ్చితంగా చాలా అవసరం. అలాంటి వైవాహిక జీవితం పట్ల కంగనా ఆసక్తి లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అంటూ కొందరు ఆమెను సమర్ధిస్తున్నారు. ఎంపీగా ఉన్నప్పటికీ సినిమాలు చేస్తాను అంటూ ఆ మధ్య చెప్పిన కంగనా రనౌత్ మెల్ల మెల్లగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. తన ఇమేజ్‌కి తగ్గ మంచి కథలను ఎంపిక చేసుకుంటుంది. వచ్చే ఏడాదిలో ఈమె నటించిన సినిమా వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా ఉపయోగపడే కథలు, సినిమాలను ఎంపిక చేసుకుంటే మంచిది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కంగనా ముందు ముందు ఎలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
పద్మ శ్రీ అవార్డ్‌తో సత్కారం
1986 లో జన్మించిన కంగనా రనౌత్ కి భారత ప్రభుత్వం 2020లో దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ శ్రీ అవార్డ్‌ను అందించింది. సినిమా రంగంలో ఆమె చేసిన సేవకు గాను పలు అవార్డులు రివార్డ్‌లు దక్కాయి. ఫోర్బ్స్ ఇండియా యొక్క టాప్ 100 సెలబ్రిటీ జాబితాలోనూ కంగనా చోటు దక్కించుకుంది. పదహారు ఏళ్ల వయసులోనే మోడలింగ్ మొదలు పెట్టిన కంగనా రనౌత్ తక్కవ వయసులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 2006 లో కంగనా మొదటి సినిమా చేసింది. తెలుగులో ప్రభాస్‌తో కలిసి ఏక్ నిరంజన్ సినిమాలో నటించింది. ఆ తర్వాత సౌత్‌లో పెద్దగా కనిపించలేదు. సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ పైనా చాలా సార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా ఇప్పుడు వ్యక్తిగతంగా పెళ్లికి దూరం అంటూ సంచలన వ్యాక్యలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.