మంచు విష్ణు 'కన్నప్ప'.. ఆస్తి అంతా తాకట్టు పెట్టి మరీ..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ రైట్స్ అమ్మే విషయంలో మాట్లాడారు. అయితే కన్నప్ప మేకర్స్.. ఏ రైట్స్ ను ఇప్పటి వరకు సేల్ చేయలేదు. ఆ విషయంపై విష్ణు స్పందించారు.;

Update: 2025-06-07 03:56 GMT

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. జూన్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న కన్నప్ప మూవీలో అనేక మంది స్టార్ నటీనటులు కనిపించనున్నారు. రుద్రుడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, కిరాతుడిగా మోహన్ లాల్, పార్వతిగా కాజల్ అగర్వాల్ సహా పలువురు సందడి చేయనున్నారు.

ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు.. ఓ రేంజ్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నారు. తద్వారా సినిమాపై అందరి ఫోకస్ పడేలా చేస్తున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ రైట్స్ అమ్మే విషయంలో మాట్లాడారు. అయితే కన్నప్ప మేకర్స్.. ఏ రైట్స్ ను ఇప్పటి వరకు సేల్ చేయలేదు. ఆ విషయంపై విష్ణు స్పందించారు. అది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అని అన్నారు. ఆడియో రైట్స్ తాను గత 14 ఏళ్లలో ఇప్పటి వరకు ఏ సినిమాకు గాను అమ్మలేదని రివీల్ చేశారు.

"నార్త్ థియేట్రికల్ డీల్ కోసం ముంబైలో ఉన్న ఓ కంపెనీని సంప్రదించా. వారేమో అంత అడ్వాన్స్ ఇవ్వం. అడ్వాన్స్ కావాలంటే సినిమా చూడాలి. వెయిట్ చేయాలన్నారు. దీంతో నేను మీకోసం సినిమా తీయలేదు. మీ కంపెనీని నమ్ముకుని పెద్ద బడ్జెట్ తో సినిమా తీయలేదు. నేను డిస్ట్రిబ్యూషన్ ఇవ్వనని చెప్పా" అని విష్ణు తెలిపారు.

"సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను. నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను. మీరొచ్చి బ్లేమ్ చేస్తారని సినిమా తీయలేదు. డబ్బు కోసం వచ్చానని ఫీలైతే నాకు ఒక్కరూపాయి కూడా వద్దు. అప్పుడు ఆ కంపెనీ సీఈవో వచ్చి సారీ చెప్పారు. కేవలం ఫైనాన్షియల్ పార్టనర్ గా ఉంటారని సంప్రదించా అంతే" అని చెప్పారు.

"నా ఫండింగ్ మనీతో సినిమా చేశాను. బ్యాంక్ లో అప్పు తెచ్చి తెరకెక్కించాను. అంతా బ్యాంక్ లో పెట్టి తీశా. ఓటీటీ డీల్ విషయానికొస్తే.. నేను పెద్ద నెంబర్ ను ప్రతిపాదించా. వాళ్ళు నార్మల్ నెంబర్ చెప్పారు. ఒకవేళ హిట్ అయితే ఎంతంటే.. నేను అనుకున్న నెంబర్ చెప్పారు. వెంటనే చెక్ రెడీ చేసుకోమని చెప్పా. నా సినిమాపై నాకు నమ్మకం ఉంది" అని చెప్పారు. ప్రస్తుతం విష్ణు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News