• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క‌త్తి ప‌ట్టుకొచ్చిన‌...

క‌త్తి ప‌ట్టుకొచ్చిన‌ ఫ్యాన్‌పై క‌మ‌ల్‌హాస‌న్ కోపం

| త‌న పేరుకు ముందు ఉల‌గ‌నాయ‌గ‌న్, యూనివ‌ర్శ‌ల్ హీరో లాంటి బిరుదులు అవ‌స‌రం లేద‌ని బ‌హిరంగంగా ఫ్యాన్స్ ని కోరారు క‌మ‌ల్ హాస‌న్.

By - Tupaki Desk
Update: 2025-06-15 06:10 GMT

త‌న పేరుకు ముందు ఉల‌గ‌నాయ‌గ‌న్, యూనివ‌ర్శ‌ల్ హీరో లాంటి బిరుదులు అవ‌స‌రం లేద‌ని బ‌హిరంగంగా ఫ్యాన్స్ ని కోరారు క‌మ‌ల్ హాస‌న్. త‌న‌కు అభిమానులే పెద్ద కానుక‌లు.. అంత‌కుమించి బిరుదులు అవ‌స‌రం లేద‌ని అన్నారు. తాను ఎప్ప‌టికీ ఒదిగి ఉంటాన‌ని క‌మ‌ల్ తెలిపారు.

ఇప్పుడు ఓ బ‌హిరంగ వేదిక‌పై క‌మ‌ల్ హాస‌న్ కి ఒక స్వోర్డ్ (పొడ‌వాటి క‌త్తి)ని కానుక‌గా ఇవ్వ‌బోయిన అభిమాని ప్ర‌వ‌ర్త‌న‌కు క‌మ‌ల్ హాస‌న్ కోపగించుకున్నారు. ఇటీవ‌లే రాజ్య స‌భ‌కు ఏకగ్రీవంగా ఎన్నికైన క‌మ‌ల్ హాస‌న్... ఈ శ‌నివారం నాడు పార్టీ స‌మావేశం నిర్వ‌హించారు. అయితే ఈ స‌మావేశంలో అభిమానుల‌తో ఫోటోలు దిగిన క‌మ‌ల్, ఒక అభిమాని చ‌ర్య‌ను మాత్రం ప్రోత్స‌హించ‌లేదు. అత‌డు పొడ‌వాటి క‌త్తిని తెచ్చి కానుక‌గా ఇవ్వబోయాడు. కానీ ఆ క‌త్తిని తిరిగి తీసుకెళ్లాల్సిందిగా క‌మ‌ల్ అత‌డిపై సీరియ‌స్ అయ్యారు. చాలా మంది అభిమానులు క‌మ‌ల్ తో ఫోటోలు దిగారు కానీ ఈ అభిమాని ప‌దే ప‌దే ఇర్రిటేట్ చేస్తూ, ఆ క‌త్తిని క‌మ‌ల్ చేతిలో ఉంచేందుకు ప్ర‌య‌త్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. క‌మ‌ల్ కొంత అస‌హ‌నంగా అత‌డిని మంద‌లిస్తున్న‌ట్టు ఈ వీడియోలో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.

చివ‌రికి ఆ అభిమానిని అక్క‌డ ఉన్న కొంద‌రు ప‌క్క‌కు తొల‌గించారు. పోలీసులు కూడా అత‌డిని ఆపేందుకు ప్ర‌య‌త్నించారు. మక్కల్ నీది మైయం (ఎం.ఎన్.ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్, అధికార డీఎంకే నుండి ముగ్గురు అభ్యర్థులు, ప్రతిపక్ష ఏఐఏడిఎంకే నుండి ఇద్దరు అభ్యర్థులు తమిళనాడు నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కమల్ `మక్కల్ నీది మయ్యమ్`, డీఎంకేతో పొత్తు పెట్టుకోగా అత‌డికి రాజ్యసభ సీటును క‌ట్ట‌బెట్టారు. 2026 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని డీఎంకే యువ‌నాయ‌కుడు ఉద‌య‌నిధి స్టాలిన్ ని త‌మిళ‌నాడు ఉప‌ముఖ్య‌మంత్రిని చేసిన సంగ‌తి తెలిసిందే. ఉద‌య‌నిధితో క‌మ‌ల్ హాస‌న్ అత్యంత స‌న్నిహితంగా మెలుగుతున్నారు.

VIDEO | Chennai: Actor and MNM Chief Kamal Haasan (@ikamalhaasan) gets angry at man who gifts him a sword during party meeting.#KamalHaasan_MP (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/5H9KZXBoEn

— Press Trust of India (@PTI_News) June 14, 2025
Tags:    
  • KamalHaasan 
  • UlagaNayagan 
  • FanMoment 
  • MNMParty 
  • TamilPolitics 
  • KamalRajyaSabha 
  • KamalHaasanSwordGift 

Similar News

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

Copyright @2026

Powered by Blink CMS