కమల్ హాసన్ కొత్త జోరు.. ప్రొడ్యూసర్‌గా భారీ లైన్‌అప్‌తో బిజీ!
కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా 'ధర్మన్'. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
లోకనాయకుడు కమల్ హాసన్ తన కెరీర్‌లో ఎన్నడూ లేనంత స్పీడ్ పెంచారు. ఒకవైపు నటుడిగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఫుల్ బిజీగా ఉంటూనే, ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. తన సొంత బ్యానర్ 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' పై మునుపెన్నడూ లేని విధంగా టాప్ స్టార్స్, క్రేజీ డైరెక్టర్లతో భారీ సినిమాలను లైన్లో పెట్టారు. సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కమల్ హాసన్ ప్రొడక్షన్ ప్లాన్స్, ఆ క్రేజీ ప్రాజెక్టుల వివరాలు చూద్దాం...
రజనీకాంత్‌తో భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ధర్మన్':
కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా 'ధర్మన్'. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్నో చర్చల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇక ఇందులో రజనీ సరసన సిమ్రాన్, రాశీ ఖన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
శివకార్తికేయన్‌తో ప్రతిష్టాత్మక చిత్రం 'సేయోన్':
ప్రస్తుతం సౌత్‌లో మంచి ఫామ్‌లో ఉన్న యంగ్ హీరో శివకార్తికేయన్‌తో కమల్ హాసన్ 'సేయోన్' అనే సినిమాను నిర్మిస్తున్నారు. శివకుమార్ మురుగేషన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. శిఇక వకార్తికేయన్‌కు ఉన్న పాన్-ఇండియా క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్కేఎఫ్‌ఐ (RKFI) సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన రిలీజ్ ప్లాన్స్‌ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
రజనీ, కమల్‌ల బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. డైరెక్టర్ నెల్సన్:
తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీకి కమల్ హాసన్ రెడీ అయ్యారు. కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించబోయే ఈ భారీ చిత్రానికి 'జైలర్' ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ ఏడాది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కాగా, వచ్చే ఏడాది నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమల్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
డైరెక్టర్ అరుణ్ కుమార్‌తో సరికొత్త ప్లాన్:
ఇక చిత్తా, వీర ధీర సూరన్ సినిమాలతో టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ ఎస్‌యూ అరుణ్ కుమార్‌తో సినిమా చేయడానికి కమల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అరుణ్ కుమార్ రెండు క్రేజీ స్టోరీలను రెడీ చేయగా, త్వరలోనే కమల్ హాసన్ వీటికి సంబంధించిన పూర్తి నరేషన్ విననున్నారు. ఇక స్క్రిప్ట్ నచ్చితే కమల్ హాసన్ స్వయంగా హీరోగా నటిస్తారు, లేదంటే ఆర్కేఎఫ్‌ఐ బ్యానర్‌లోనే మరో టాప్ హీరోతో ఈ సినిమాను నిర్మిస్తారు.
సొంతంగా మరో రెండు ప్రాజెక్టులు:
ఇతర హీరోల సినిమాలతో పాటు కమల్ హాసన్ తన కోసం రెండు కొత్త స్క్రిప్ట్‌లను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. వీటిలో ఒక కథ త్వరలోనే లాక్ కానుంది. మొత్తానికి నటుడిగా, ప్రొడ్యూసర్‌గా కమల్ హాసన్ పడుతున్న ఈ కష్టం చూసి ఇండస్ట్రీ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్, ఈ వయసులోనూ ఆయన చూపిస్తున్న జోరు నిజంగా గ్రేట్ అని చెప్పాలి.