• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒక గ‌జ దొంగ యాటిట్యూడ్...

ఒక గ‌జ దొంగ యాటిట్యూడ్ గురించి సినిమా

| ఫిలింమేకింగ్, డిజిటల్ పరివర్తన, కథ చెప్పడం, ఆధునిక యుగంలో వినోదం, వ్యాపార విధానాలు వంటి చాలా అంశాలను ఇక్క‌డ చ‌ర్చించారు.

By - Tupaki Desk
Update: 2025-02-25 03:41 GMT

'నాయ‌క‌న్' లాంటి కల్ట్ క్లాసిక్ విడుద‌లైన రెండు ద‌శాబ్ధాల‌కు ఇప్పుడు విశ్వన‌టుడు క‌మ‌ల్ హాస‌న్- మ‌ణిర‌త్నం క‌లిసి థ‌గ్ లైఫ్ అనే చిత్రానికి ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రంలో సింబు, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి, నాజ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. థగ్ లైఫ్ 5 జూన్ 2025న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాని సాంకేతికంగా అత్యుత్త‌మంగా తీర్చిదిద్దార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. మ‌ణిర‌త్నం మార్క్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ని దీనికోసం అనుస‌రించారు.

తాజాగా ఫిక్కీ సౌత్ కాన్ క్లేవ్ లో దక్షిణ భారత సినిమా అభివృద్ధి, ప్రపంచ మార్కెట్‌పై దాని ప్రభావాన్ని చర్చించడానికి ప్ర‌ముఖులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమావేశంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ప్రముఖ నటుడు- ద‌ర్శ‌క‌ నిర్మాత కమల్ హాసన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఫిలింమేకింగ్, డిజిటల్ పరివర్తన, కథ చెప్పడం, ఆధునిక యుగంలో వినోదం, వ్యాపార విధానాలు వంటి చాలా అంశాలను ఇక్క‌డ చ‌ర్చించారు.

ఈ సమావేశంలో కమల్ హాసన్, త్రిష ప్రశ్నోత్తరాల విభాగంలో పాల్గొన్నారు. ప్రేక్షకుల నుండి ప్రశ్నలను ఎదుర్కొన్నారు. కమల్ హాసన్ ని మ‌ణిర‌త్నం `థ‌గ్ లైఫ్`లో త‌న పాత్ర గురించి ప్ర‌శ్నించారు. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ రంగరాజ్ శ‌క్తివేల్ నాయకర్ అనే గ‌జ‌దొంగ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఈ పాత్ర మంచి చెడుల గురించి ప్ర‌శ్నించ‌గా, ``సినిమా చూసిన తర్వాతే మీకు అర్థమవుతుంది`` అని క‌మల్ చాలా డిప్ల‌మాటిగ్గా స్పందించారు. ఎక్కువగా రివీల్ చేసేస్తే దర్శకుడు మణిరత్నం తనను క్వ‌శ్చ‌న్ చేస్తార‌ని క‌మ‌ల్ అన్నారు. నేను ఎడిటింగ్ ప్రక్రియతో ఇబ్బంది పడుతున్నాను. మీరు (మీడియా) ఇప్పటికే మొత్తం కథను ప్ర‌జ‌ల‌కు చెప్పేసారు! అని అన్నారు. ఈ పాత్ర మంచి, చెడు రెండింటి మిశ్రమం అని కమల్ అన్నారు. రంగ‌రాజ్ శ‌క్తివేల్ ధృక్ప‌థం ఏమిట‌న్న దానిపైనా క‌థ అంతా ఆధారపడి ఉంటుందని కూడా చెప్పారు.

Tags:    
  • ThugLife 
  • KamalHaasan 
  • ManiRatnam 
  • ThugLifeFilm 
  • SouthIndianCinema 
  • Kollywood 
  • TamilCinema 
  • ARRahman 
  • FilmMaking 
  • ThugLifeMovie 
  • Filmindustry 

Similar News

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

Copyright @2026

Powered by Blink CMS