రూటు మార్చిన మ్యాడ్ డైరెక్టర్
జీవితంలో ఎలాగైతే ఎవరూ ఊహించనివి జరుగుతాయో సినీ ఇండస్ట్రీలో కూడా అలానే జరుగుతుంటాయి.;
జీవితంలో ఎలాగైతే ఎవరూ ఊహించనివి జరుగుతాయో సినీ ఇండస్ట్రీలో కూడా అలానే జరుగుతుంటాయి. ముందు ఒక ప్రాజెక్టును అనుకోవడం, అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఏవో కారణాల వల్ల దాన్ని పక్కకు పెట్టి కొత్త ప్రాజెక్టును లైన్ లో పెట్టడం లాంటివి ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో సార్లు జరగ్గా, ఇప్పుడు మరోసారి అలాంటి సంఘటనే జరుగుతుంది.
మ్యాడ్ తో సూపర్‌హిట్లు అందుకున్న కల్యాణ్ శంకర్
మ్యాడ్ ఫ్రాంచైజ్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నారు డైరెక్టర్ కల్యాణ్ శంకర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఆ రెండు సినిమాలూ మంచి టాక్ తో పాటూ సదరు నిర్మాణ సంస్థకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టాయి. మ్యాడ్ సినిమాలతో వచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ, ఆ జోష్ లోనే కల్యాణ్ శంకర్ తన తర్వాతి సినిమాను మాస్ మహారాజా రవితేజతో చేయనున్నారని బాగా ప్రచారం జరిగింది.
రవితేజతో కల్యాణ్ శంకర్ మూవీ
కల్యాణ్ చెప్పిన కథ రవితేజకు బాగా నచ్చిందని, ప్రాజెక్టు ఓకే అయిందని, ఈ సినిమాను కూడా సితార సంస్థే నిర్మించనుందని, ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయని అన్నారు. కానీ తర్వాత ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వినిపించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం కల్యాణ్ ప్రస్తుతానికి రవితేజతో చేయాలనుకున్న ప్రాజెక్టును పక్కన పెట్టారని తెలుస్తోంది.
హార్రర్ కామెడీ జానర్ లో మ్యాడ్ డైరెక్టర్ మూవీ
రవితేజ కథను పక్కన పెట్టి ఓ హార్రర్ కామెడీ సినిమా చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట. అది కూడా సితార బ్యానర్‌లోనే. బాయ్స్ హాస్టల్ లోకి దెయ్యమొస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో కల్యాణ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని, ఈసారి హార్రర్ కు కామెడీని మిక్స్ చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలని కల్యాణ్ డిసైడ్ అయ్యారట. అంతా వాళ్లతోనే ఈ సినిమాను తీయాలని, ఈ సినిమా పూర్తయ్యాకే రవితేజ తో మూవీ చేద్దామని కల్యాణ్ ప్లానింగ్ లో ఉన్నారట. రవితేజతో కల్యాణ్ అనుకున్న సినిమా సోషియో ఫాంటసీ మూవీ కావడంతో దాని బడ్జెట్ రూ.100 కోట్లకు పైనే అవుతుందని, ఈ టైమ్ లో అంత భారీ బడ్జెట్ వర్కవుట్ అవుతుందో లేదోనని, కల్యాణ్ ముందు ఈ హార్రర్ కామెడీని చేస్తున్నారని, ఈ మూవీ బాగా సక్సెస్ అయి, ప్రాఫిట్స్ వస్తే అప్పుడు రవితేజ సినిమా గురించి ఆలోచించొచ్చని మేకర్స్ భావిస్తున్నారట.