కొత్త ఏడాది నందమూరి వారసుడి కొత్త విషయాలేంటి?
నందమూరి వారసుడు కల్యాణ్ రామ్ కి `బింబిసార` తర్వాత మరో బ్లాక్ బస్టర్ పడలేదు. ఆ తర్వాత నటించి మూడు సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు.;
నందమూరి వారసుడు కల్యాణ్ రామ్ కి `బింబిసార` తర్వాత మరో బ్లాక్ బస్టర్ పడలేదు. ఆ తర్వాత నటించి మూడు సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. `అమిగోస్` ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా? విమర్శకుల ప్రశంసలకే పరిమితమైంది. `డెవిల్` కూడా అలాంటి రిజల్టే అందుకుంది. ఆ తర్వాత రిలీజ్ అయినా `అర్జున్ సన్నాఫ్ వై జయంతి` చూసిన తర్వాత కళ్యాణ్ రామ్ మళ్లీ ట్రాక్ తప్పి పోతున్నాడా? అనిపించింది. కానీ కంగారు పడి కొత్త సినిమాలు చేయలేదు. తెలివిగా `బింబిసార`కు సీక్వెల్గా `బింబిసార 2`ని ప్రకటించాడు.
ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. `బింబిసార` దర్శకుడు ఈసారి పార్ట్ 2 బాధ్యతలు మరో కొత్త కుర్రాడికి అప్పగించాడు. అనీల్ పాడూరి అనే కొత్త డైరెక్టర్ ని తెరపైకి తెచ్చాడు. బ్యాకెండ్ లో వశిష్ట పనితనం ఎలాగూ ఉంటుంది. ఆ నమ్మకంతోనే డైరెక్టర్ మారినా కల్యాణ్ రామ్ దైర్యంగా ముందుకెళ్తున్నాడు. ఈసినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. గత ఏడాదే విషయం వెల్లడించారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఆరు నెలల క్రితం ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమా అప్ డేట్స్ లేకపోవడంతో? ప్రాజెక్ట్ ఆగిపోయిందా? అన్న చర్చ కూడా ఫిలిం సర్కిల్స్ లో జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ రైటర్ శ్రీకాంత్ విస్సాతో ఓ సినిమాకు కమిట్ అయినట్లు వస్తోన్న కథనాలు `బింబిసార2` అవాంతరానికి మరింత ఆజ్యం పోసిసట్లు అవుతుంది. ఇటీవలే శ్రీకాంత్ స్టోరీని కల్యాణ్ రామ్ లాక్ చేసినట్లు సమాచారం. కొత్త వాళ్లను ప్రోత్సహించడంలో కల్యాణ్ రామ్ ఎప్పుడు ముందుంటారు. శ్రీకాంత్ కూడా చాలా సినిమాలకు రైటర్ గా పని చేసారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇతడితో గాక మరో రెండు , మూడు కథలు కూడా లాక్ చేసి పెట్టినట్లు వినిపిస్తోంది.
వాటికి దర్శకులు ఎవరు? అన్నది కూడా ఫైనల్ అవ్వాల్సి ఉంది. కొత్త ఏడాది ప్రారంభమైన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. కల్యాణ్ రామ్ నిర్మాతగా కూడా బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించాల్సిన ప్రాజెక్ట్ లు కూడా డిలే అవుతున్నాయి. పెరిగిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నేపథ్యంలో దగ్గరుండి చూసుకుంటున్నారు. త్వరలో `దేవర 2` కూడా పట్టాలెక్కించాలని రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కల్యాణ్ రామ్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.