కల్కి 2898 AD.. నిర్మాతకు ఓ టెన్షన్ తీరింది!

ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ ని చిత్ర యూనిట్ స్పీడ్ అప్ చేసింది.

Update: 2024-05-23 15:30 GMT

టాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ మూవీగా 600+ కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి జూన్ 27న రిలీజ్ కాబోతున్న సినిమా కల్కి 2898ఏడీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భైరవగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి బుజ్జి విత్ భైరవ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ గ్రాండ్ గా రిలీజ్ చేసింది. రామోజీ ఫిలిం సిటీలో ఈ వేడుక జరిగింది. ప్రభాస్ కూడా భైరవ లుక్ లో పబ్లిక్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ ని చిత్ర యూనిట్ స్పీడ్ అప్ చేసింది.

ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని సైన్స్ ఫిక్షన్ కథతో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి బిజినెస్ డీల్స్ మేగ్జిమమ్ క్లోజ్ అయ్యాయంట. వరల్డ్ వైడ్ గా 22 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. హాలీవుడ్ లో స్ట్రైట్ థియేటర్స్ లో రిలీజ్ అవుతోన్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా కల్కి 2898ఏడీ ఉండబోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని మేగ్జిమమ్ అన్ని భాషలలో వైజయంతీ మూవీస్ సొంతంగా రిలీజ్ చేసుకుంటుందట. డిస్టిబ్యూటర్స్ తో కమిషన్ బేస్డ్ మాట్లాడుకొని చిత్రాన్ని అత్యధిక స్క్రీన్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. ఇక సౌత్ భాషలకి సంబందించిన డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా హిందీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. అలాగే తెలుగు శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ సొంతం చేసుకుంది.

Read more!

మొన్నటివరకు నిర్మాత అశ్వినీ దత్ ఈ బిజినెస్ వ్యవహారాలలో చాలా బిజీగా ఉన్నారు. మొత్తానికి డీల్స్ అన్ని అనుకున్న రేట్లకు కుదరడంతో టెన్షన్ తీరినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ రైట్స్ ని సరిగమ మ్యూజిక్ కంపెనీ కొనుగోలు చేసింది. ఓవరాల్ గా నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా కల్కి 2898ఏడీ సినిమాకి 300+ కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే థీయాట్రికల్ రైట్స్ బిజినెస్ లెక్కలు 400+ కోట్లకి పైనే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలని అనుకుంటున్నారు. చిత్ర యూనిట్ కూడా సినిమాని వీలైనంత గ్రాండ్ గా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ మూవీలో అశ్వద్ధామ పాత్రలో నటించారు. దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా చేశారు. కమల్ హాసన్ మూవీలో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా ఈ చిత్రం రాబోతోంది.

Tags:    

Similar News