• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి 2898 ఏడీ.. ఫస్ట్ షో...

కల్కి 2898 ఏడీ.. ఫస్ట్ షో పడేది ఎక్కడంటే..

| డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న థియేటర్స్ లోకి వస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-06-11 05:28 GMT

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న థియేటర్స్ లోకి వస్తోంది. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వరల్డ్ వైడ్ గా 22 భాషలలో కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కానుంది. అయితే థియేటర్స్ రిలీజ్ ఎన్ని భాషలలో అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. తాజాగా ట్రైలర్ ని ఐదు భాషలలో రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ కి ఫుల్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో సినిమాపైనే కూడా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. కచ్చితంగా కల్కి 2898 ఏడీ మూవీ ఇండియాలో ఈ ఏడాది వచ్చే అతిపెద్ద సినిమా కావడమే కాకుండా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా ఉంటుందని ట్రేడ్ పండితుల అంచనా. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.

అలాగే కమల్ హాసన్ కల్కి మూవీలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షోలకి సంబందించిన ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా చోట్ల ప్రారంభమయ్యాయి. ట్రైలర్ అందరికి కనెక్ట్ కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ మరింతగా పుంజుకుంటాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు

ఇదిలా ఉంటే కల్కి 2898 ఏడీ చిత్రాన్ని రిలీజ్ కి ఒక రోజు ముందుగానే లండన్ లో స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించబోతున్నారంట. అంటే జూన్ 26న లండన్ లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఐమ్యాక్స్ లో రాత్రి 8.30 గంటలకి ప్రీమియర్ షో పడబోతుందంట. ఇందులో చాలా తక్కువ సినిమాలని స్పెషల్ ప్రీమియర్స్ గా ప్రదర్శిస్తూ ఉంటారు. గతంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రీమియర్ గా వేశారు.

అయితే అక్కడ కేవలం ఫిల్మ్ ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ మాత్రమే చూసే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ రాబట్టాలని చిత్ర యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. మేగ్జిమమ్ అన్ని ఏరియాలలో అడ్వాన్స్ బేస్డ్ మీద నిర్మాణ సంస్థ డిస్టిబ్యూటర్స్ తో కలిసి కల్కి 2898 ఏడీ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.

Tags:    
  • Prabhas 
  • kalki2898ad 
  • Nagashwin 
  • Kamalhaasan 
  • Deepikapadukone 
  • Santhoshnarayan 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS