• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ AMBలో కల్కి.. ఏకంగా...

మహేష్ AMBలో కల్కి.. ఏకంగా అన్ని షోలా!

| పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ.. మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-06-24 06:03 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ.. మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం మూవీ లవర్స్ తోపాటు ప్రభాస్ ఫ్యాన్స్.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాపై సెలబ్రిటీలతో పాటు నార్మల్ ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక మేకర్స్.. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు. మూవీలో నటించిన వారి లుక్స్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కంటిన్యూగా ఏదో ఒక అప్డేట్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ప్రీ లూడ్ వీడియోస్ నెట్టింట ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక అమెరికాలో కల్కి మూవీ ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.

అయితే తెలంగాణ సర్కార్.. కల్కి మూవీ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు ఐదు షోలు వేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిలీజ్ రోజు ఉదయం 5.30 గంటలకు స్పెషల్ షో వేసేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. దీంతో హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ ల్లో భారీ సంఖ్యలో షోలు పడనున్నాయి. చాలా మల్టీప్లెక్స్ ల్లో 40 షోలు వేయనున్నట్లు తెలుస్తోంది.

ఏఎంబీలో తొలి రోజు దాదాపు కల్కి 40 షోలు పడనున్నాయని సమాచారం. నల్లగండ్ల అపర్ణ సినిమాస్ లో 42 షో లు, ప్రసాద్ ఐమాక్స్ లో 30 షో లు వేయనున్నారని తెలిసింది. దీనిబట్టి చూస్తే.. జూన్ 27వ తేదీన ఎక్కడ చూసినా కల్కి మూవీ సందడే అన్నమాట. నిన్న.. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో కల్కి ప్రీ బుకింగ్స్ జరిగాయి. ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుంచి జీవో వచ్చిన వెంటనే అక్కడ కూడా స్టార్ట్ అవుతాయి.

అయితే బుక్ మై షోలో కొన్ని నిమిషాల్లోనే థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. ఓ దశలో గంటకు ఏకంగా యావరేజ్ గా 60వేల టికెట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్ లో అయితే.. నిమిషాల్లోనే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. దీనిబట్టి చూస్తే.. కల్కి మూవీకి ఏ రేంజ్‍ లో క్రేజ్ ఉందో ఈజీగా అర్ధమవుతుంది. మరి ఈ సినిమా.. రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

కల్కి 2898 ఏడీ సినిమాను మైథాలజీతో సైన్స్ ఫిక్షన్ మూవీగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా కొందరు స్టార్ యాక్టర్ల క్యామియోలు కూడా ఈ మూవీలో ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్‍తో నిర్మించింది.

Tags:    
  • Kalki2898ad 
  • Prabhas 
  • Nagashwin 
  • Kamalhaasan 
  • Deepikapadukone 
  • Nizam 
  • AMB 
  • Hyderabad 
  • Ashwinidutt 
  • Bookmyshow 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS