ప్రభుత్వ మార్పుపై 'కల్కి' ఆశలు..!?

ఇండస్ట్రీలో ఎవరికి ఏమో కానీ కల్కి సినిమాకి మాత్రం ఏపీలో ప్రభుత్వం మారాలని గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2024-05-14 11:19 GMT

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమా పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఎన్నికల కారణంగా వాయిదా పడింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వడంతో పాటు అక్కడ ప్రభుత్వం మారితే సినిమా టికెట్ రేట్స్ ఎలా పడితే ఆలా పెంచుకొనే అవకాశం ఉంటుంది అని ఆశ పడుతున్నారు ఇండస్ట్రీ జనాలు . ఇండస్ట్రీలో ఎవరికి ఏమో కానీ కల్కి సినిమాకి మాత్రం ఏపీలో ప్రభుత్వం మారాలని గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది.

కల్కి సినిమా నిర్మాత అశ్వినీద్‌ బాహాటంగానే తెలుగు దేశం పార్టీకి మద్దతు పలికిన విషయం తెల్సిందే. అంతకు ముందు నుంచి కూడా తెలుగు దేశం పార్టీకి అశ్వినీదత్ మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నాడు.

కల్కి సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. కనుక వైకాపా ప్రభుత్వం ఉంటే మాత్రం కచ్చితంగా టికెట్ల రేట్లు పెంచాలి అంటే రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి . కనుక ఏపీలో చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ఏపీలో ప్రభుత్వం మారి తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రావాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. దాంతో ఆ వార్తలు కల్కి సినిమాకు కొంతలో కొంత అయినా ఊరట కలిగిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వారి అంచనాలు తల కిందు అయ్యి, వైకాపా ప్రభుత్వం మళ్లీ వస్తే మాత్రం కల్కి సినిమాకు కచ్చితంగా కష్టాలు తప్పవు అనేది కొందరి వాదన. తెలంగాణలో టికెట్ల రేట్లతో పోల్చితే ఏపీలో చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడ ప్రభుత్వం మారాలి, టికెట్ల రేట్లు పెరగాలని ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకున్నారు. అదే జరిగే అవకాశం ఉందని కల్కి ఫిల్మ్‌ మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News