అభిమానుల కోరిక.. ప్ర‌భాస్ ఏమంటాడో?

`క‌ల్కి 2` నుంచి బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. దీంతో అమ్మ‌డు పోషించిన తుల‌సి పాత్ర‌ను ఏ న‌టితో భ‌ర్తీ చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.;

Update: 2025-09-22 09:30 GMT

`క‌ల్కి 2` నుంచి బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. దీంతో అమ్మ‌డు పోషించిన తుల‌సి పాత్ర‌ను ఏ న‌టితో భ‌ర్తీ చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబ‌ట్టి ఏ న‌టిని తీసుకున్నా ఆ రేంజ్ న‌టినే తీసుకోవాలి. కొత్త వారిని తీసుకునే ప‌రిస్థితి లేదు. అలా చూసుకుంటే బాలీవుడ్ న‌టీమ ణులే క‌నిపిస్తున్నారు. కానీ మేక‌ర్స్ మాత్రం ఈసారి వాళ్ల‌కంటే బాగా తెలిసిన వారికే ఛాన్స్ ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇది పూర్తిగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నిర్ణ‌యం మీద‌నే ఆధార‌ప‌డి ఉంది.

ఎంపిక ఎవ‌రి నిర్ణ‌యం:

ఈ ప్రాజెక్ట్ కి క‌ర్త‌, కర్మ, క్రియ అన్నీ ఆయ‌నే. హీరో..నిర్మాత ముఖ్య‌మే అయినా ఇద్ద‌రు నాగీని దాటి వెళ్ల‌రు. ఆయ‌న మాట‌ కాద‌న‌లేరు. కాబ‌ట్టి ఏ హీరోయిన్ ని ఎంపిక చేయాలి? అన్న‌ది అత‌డి నిర్ణ‌య‌మే. పైగా ఇలాంటి విష‌యాల్లో ప్ర‌భాస్ కూడా పెద్ద‌గా క‌ల్పించుకోడు. మేక‌ర్స్ నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ప‌ని చేస్తారు. కానీ ఈ సినిమా హీరోయిన్ విష‌యంలో మాత్రం డార్లింగ్ చొర‌వ తీసుకుంటేనే బాగుంటుది? అన్న అభిప్రాయం అభిమానుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

అనుష్క ఓ ఆప్ష‌న్:

ప్ర‌భాస్ కి ప‌ర్పెక్ట్ జోడీగా అనుష్క శెట్టి మాత్ర‌మే స‌రితూగుతుంద‌ని ఇంకెవ్వ‌రు సాటి రాలేర‌ని..ఈ నేప‌థ్యంలో ఆమెనే తీసుకుంటే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు. సినిమాలో సుమ‌తి పాత్ర కూడా గ‌ర్బ‌వ‌తిగా క‌నిపి స్తుంది. ప్ర‌స్తుతం అనుష్క రూపంలో కొన్ని ర‌కాల మార్పులున్న నేప‌థ్యంలో సుమ‌తి పాత్ర‌కు ప‌క్కాగా స‌రిపో తుందంటున్నారు. `బాహుబ‌లి` సినిమాతో పాన్ ఇండియాలో కూడా ఆమెకు గుర్తింపు ఉండ‌టంతో ఆమెని మించిన న‌టిని వెత‌క‌డం అంటే? స‌మ‌యం వృదాగానే భావిస్తున్నారు.

డార్లింగ్ మాట కాదంట‌రా:

కానీ ఇక్కడ అనుష్క ఎంట‌ర్ అవ్వాలంటే రెండు జ‌ర‌గాలి. ఒక‌టి నాగీ ఆమె విష‌యంలో పూర్తి సంతృప్తిగా ఉండి పిలివగ‌ల‌గాలి. అలా కాక‌పోతే? ప్ర‌భాస్ అనుష్క‌ పేరును స‌జ్జెస్ట్ చేయాలి. డార్లింగ్ రికమండీష‌న్ అంటే నాగీ కూడా అంత తేలిగ్గా కొట్టి పారేయ‌లేరు. తాను కూడా ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటారు. అవ‌స‌ర‌మైతే లుక్ టెస్టులు చేసి అన్ని రకాలుగా ఫిట్ అనుకుంటే? తీసుకొవొచ్చు. లేదా హోల్డ్ లో పెట్టొచ్చు. ఎవ‌రు సెట్ కాని ప‌రిస్థితుల్లో అనుష్క‌ను మ‌ళ్లీ పున:ప‌రిశీల‌న చేసి తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

Tags:    

Similar News