• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి-2 నుంచి దీపిక...

కల్కి-2 నుంచి దీపిక పాత్రనే తీసేస్తే?

| గత ఏడాది విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయిన సినిమా.. కల్కి 2898 ఏడీ. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు.

By - Garuda Media
Update: 2025-09-20 04:03 GMT

గత ఏడాది విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయిన సినిమా.. కల్కి 2898 ఏడీ. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఏడాది నుంచి ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. స్క్రిప్టు దాదాపుగా రెడీ అయింది. ప్రభాస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు చిత్రీకరణ మొదలుపెడదామని చూస్తున్నారు. ఇంతలో ‘కల్కి’లో సుమతిగా అత్యంత కీలకమైన పాత్ర చేసిన దీపికా పదుకొనే సినిమా నుంచి తప్పుకున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించడం సంచలనంగా మారింది.

ఇలాంటి క్రేజీ సీక్వెల్ నుంచి ప్రధాన పాత్రధారి తప్పుకోవడం కచ్చితంగా చిత్ర బృందానికి ఇబ్బందే. ఆ పాత్రలో మరో నటిని ప్రేక్షకులు అంగీకరిస్తారా.. ఇంకొకరు ఆ పాత్రను అంత కన్విన్సింగ్‌గా పోషించగలరా అన్నది ప్రశ్న. ఈ పాత్రకు దీపిక స్థానంలో ఎవరైతే బాగుంటుంది అని చర్చించుకుంటున్నారు జనం.

ఐతే ‘కల్కి-2’ నుంచి దీపికను తప్పించడంతో సరిపెట్టకుండా ఆమె పాత్రనే లేపేస్తే ఎలా ఉంటుంది.. ఆ దిశగా చిత్ర బృందం ఏమైనా ఆలోచిస్తోందా అనే చర్చ జరుగుతోందిప్పుడు. కల్కి-2కు సంబంధించి ఇప్పటికే దీపిక మీద కొన్ని సన్నివేశాలు తీశారు. అంతటితో పరిమితం చేసి.. కథ ప్రకారం ఆమె పాత్రను ఇక చూపించాల్సిన అవసరం లేకుండా ఏమైనా మార్పు చేసే అవకాశముందా అని సోషల్ మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు.

‘కల్కి’ టీం ముందు నుంచి చెబుతున్నది ఏమంటే.. రెండో భాగంలో కమల్ హాసన్, ప్రభాస్‌ల పాత్రల నిడివి, ప్రాధాన్యం ఇంకా ఎక్కువ ఉంటుందని. అమితాబ్‌కు సైతం బాగానే స్కోప్ ఉంటుందట. ఈ ముగ్గురినీ హైలైట్ చేస్తూ కథలో దీపిక పాత్ర ప్రాధాన్యాన్నే తగ్గించేస్తే ఎలా ఉంటుంది.. వాయిస్ ఓవర్లో ఆ పాత్ర గురించి చెప్పించి దాని కథ ముగించేస్తే ఇంకో నటి గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు కదా.. సుమతి గురించి ప్రేక్షకులు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేకుండా మిగతా పాత్రలతో మ్యాజిక్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా.. ఈ దిశగా ఏమైనా టీం ఆలోచిస్తోందా అని ‘కల్కి’ ఫ్యాన్స్ ఊహాగానాల్లో మునిగిపోయారు.

Tags:    
  • Kalki2898AD 
  • DeepikaPadukone 
  • Prabhas 
  • NagAshwin 
  • VyjayanthiMovies 
  • Kalki2 
  • KamalHaasan 
  • AmitabhBachchan 
  • Tollywood 
  • పాన్‌ఇండియా 
  • ప్రభాస్ 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS