• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైకలాజికల్ థ్రిల్లర్...

సైకలాజికల్ థ్రిల్లర్ కలి.. రిలీజ్ ఎప్పుడంటే ?

| రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-09-16 13:16 GMT

తెలుగు యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్ లో కలి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శివ శేషు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. ప్రముఖ కథా రచయిత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రూపొందుతోంది. రుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్.. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

కలి పాత్ర నేపథ్యంతో ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. సస్పెన్స్, అదిరిపోయే ట్విస్టులతో టీజర్ సినిమాపై ఆడియన్స్ లో క్రేజీ అండ్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. స్పెషల్ కాన్సెప్ట్ తో మూవీ ఉండనున్నట్లు అర్థమైంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్.. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు.

తాజాగా కలి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేసి అప్డేట్ ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే పోస్టర్ లో ప్రిన్స్, నరేష్ అగస్త్య లుక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక కొత్త కాన్సెప్ట్ ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు అనిపిస్తుందని నెటిజన్లు చెబుతున్నారు.

మూవీ స్టోరీ లైన్ ఇదేనా?

టీజర్ ప్రకారం.. కొన్ని కారణాల వల్ల బతకడం ఇష్టం లేక సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునేందుకు సిద్ధమవుతాడు. అదే సమయంలో తనకు ఎలాంటి పరిచయం లేదని నరేష్ అగస్త్య ఇంటికి వస్తాడు. అప్పుడు శివరామ్ జీవితంలో జరిగిన విషయాలు చెబుతాడు. దీంతో శివరామ్ షాక్ అయిపోతాడు. తన విషయాలు అతనికి ఎలా తెలిశాయని అనుకుంటాడు.

అసలు శివరామ్ నిర్ణయానికి కారణమేంటి? మ్యారేజ్ అయ్యాక భార్యతో హ్యాపీ లైఫ్ ను మెయింటైన్ చేస్తున్నా ఎందుకు చనిపోవాలనుకుంటాడు? ఎలాంటి పరిచయం లేని శివరామ్ ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు? అతని విషయాలు ఎలా తెలిశాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలే కలి మూవీ! మరి ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలా అలరిస్తుందో? ప్రిన్స్, అగస్త్యకు ఎలాంటి హిట్ ఇస్తుందో? వేచి చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Kali 
  • KaliReleasedate 
  • NareshAgastya 
  • Prince 
  • NehaKrishnan 
  • Gauthamraju 
  • GunduSudarshan 
  • KedarShankar 
  • ManiChandana 
  • LeelaGowthamVarma 
  • Rudracreations 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS