• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  31 ఏళ్ల‌లో సీనియ‌ర్...

31 ఏళ్ల‌లో సీనియ‌ర్ న‌టికి తొలి లిప్ లాక్ అనుభ‌వం

| కాజోల్ తాజాగా 'ది ట్రయల్'తో తిరిగి అభిమానుల ముందుకు వచ్చింది. ఇది కెరీర్ లో తొలి వెబ్ సిరీస్. అంతేకాకుండా తెర పై లిప్ లాక్ వేయడం కూడా ఇదే మొదటిసారి.

By - Tupaki Desk
Update: 2023-07-15 03:41 GMT

మూడు దశాబ్ధాలు పైబడిన కెరీర్ లో ఏనాడూ సదరు హీరోయిన్ తన హీరోల తో లిప్ లాక్ వేయలేదు. కానీ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కోసం సహనటుడి తో ఘాటైన లిప్ లాక్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. మ్యారీడ్ బ్యూటీ కాజోల్ గురించే ఇదంతా. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే లాంటి క్లాసిక్ ప్రేమకథా చిత్రం తో ప్రేమికురాలి గా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన కాజోల్ కెరీర్ ఆద్యంతం ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల్లో నటించారు. స్టార్ హీరో అజయ్ దేవగన్ భార్యగా ను సుపరిచితురాలు.

కాజోల్ సెకండ్ ఇన్నింగ్స్ లో సౌత్ లోను నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల హిందీ వెబ్ సిరీస్ లతో కెరీర్ పరంగా బిజీ అవుతోంది. ప్రతిభావంతురాలైన కాజోల్ తాజాగా 'ది ట్రయల్'తో తిరిగి అభిమానుల ముందుకు వచ్చింది. ఇది కెరీర్ లో తొలి వెబ్ సిరీస్. అంతేకాకుండా తెర పై లిప్ లాక్ వేయడం కూడా ఇదే మొదటిసారి. 1992లో బెఖుడి తో తెరంగేట్రం చేసిన కాజోల్ ఈ 31 ఏళ్లలో ఇప్పటి వరకు తన సహనటుడిని ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదు. ముఖ్యంగా పెదవి ముద్దులు పెట్టుకోలేదు. వెబ్ షో 'ది ట్రయల్'లో కాజోల్ మొదటిసారిగా ఆన్-స్క్రీన్ కిస్ చేసింది.

'ది ట్రయల్' కథాంశం ఆసక్తికరం. తన భర్త లంచం లైంగిక వేధింపుల కుంభకోణం లో చిక్కుకున్న తర్వాత తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాడే తల్లి గురించిన కథ ఇది. ఆమె తన కుటుంబ అవసరాల ను తీర్చుకోవడానికి ఒక లా ఫర్మ్ లో చేరవలసి వస్తుంది. కాజోల్ పాత్ర పేరు నయోనికా సేన్ గుప్తా.. ఆమె విశాల్ చౌబే సహ-యాజమాన్యమైన సంస్థలో ఉద్యోగం పొందుతుంది. అయితే ఉద్యోగం లో చేరడమే ఒక ట్విస్టు. కాలేజ్ డేస్ లో విశాల్ తో డేటింగ్ చేసి విడిపోయిన నయోనికా ఆ తర్వాత రాజీవ్ సేన్ గుప్తా (జిషు సేన్ గుప్తా)ను పెళ్లాడుతుంది. అయితే నోయోనికా - విశాల్ (అలీఖాన్ ) చాలా సంవత్సరాల తర్వాత కలుసుకునే క్రమంలో ఇద్దరిలో ఏదో తెలియని అలజడి. ఆ సమయం లో ఉద్విగ్నత ముద్దుకు దారితీస్తుంది.

యాదృచ్ఛికంగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్ తో తన ముద్దు సన్నివేశం గురించి అలీ ఖాన్ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. నా చిన్న తనం లో నా అభిమాన నటీమణుల్లో ఒకరు కాజోల్. నేను మూడు దశాబ్దాలుగా తన నటనను చూస్తున్నాను. మేం ఒకే స్టూడియోలో కలిసి పని చేసేవాళ్లం. ఆమె చాలా హాట్ హెడ్ అని నేను విన్నాను. ఇప్పుడు నేను తనతో ఒక వెబ్ సిరీస్ ను పూర్తి చేసాను. అందులో నేను ఆమె ప్రియుడిగా నటించాను. మా మధ్య ముద్దు సన్నివేశాలున్నాయి" అని తెలిపాడు. నేను ఆమె బాయ్ఫ్రెండ్ ని.. పైగా ఆమె బాస్ పాత్రను పోషించాను. మేమిద్దరం ఫ్రెంచ్ కిస్ లాగించేసాం. అంతేకాదు.. మేము కలిసి కొన్ని కోర్టు కేసుల ను పరిష్కరించడానికి వెళతాము అని తెలిపాడు.

ముంబై లోని ఒక ఖరీదైన హోటల్ లో ముద్దు సన్నివేశం షూటింగ్ చేస్తున్నాం. మాకు క్లోజ్డ్ సెట్ కావాలా అని దర్శకుడు అడిగారు. అంటే ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే లోనికి హాజరు కావడానికి అనుమతిస్తారు. నేను ముద్దు పెట్టుకునే ముందు దర్శకుడిని కాజోల్ ని సంప్రదించాను.. కానీ ఒక్క సెక ను కూడా ఎటువంటి ఇబ్బంది లేదా సంకోచం లేకుండా ఆ సన్నివేశం పూర్తయింది.. అని తెలిపాడు. ఇది చాలా ప్రొఫెషనల్ షూట్. ముద్దు సన్నివేశాన్ని మూడు నాలుగు సార్లు రిహార్సల్ చేసాం. ప్రతిసారీ మేము మానిటర్ల వద్దకు వెళ్లి హ్యాపీనా అని అడిగాము. చివరికి ఓకే అయింది.. అని తెలిపారు. కాజోల్ 'ధన్యవాదాలు నా ప్రియతమా' అని అతడు వ్యాఖ్యానించారు. కింగ్ ఖాన్ షారూఖ్ .. దేవగన్.. అమీర్ ఖాన్.. అరవింద స్వామి సహా పరిశ్రమ అగ్రహీరోలందరి సరసనా నటించిన కాజోల్ తన కెరీర్ లో ఏనాడూ లిప్ లాక్ వేసింది లేదు. కానీ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ సహనటుడికి లిప్ లాక్ దక్కింది.

Tags:    
  • Kajol 
  • ThrTrail 
  • WebSeries 
  • LipLockScene 
  • HotTopic 
  • Bollywood 
  • Actress 
  • TupakiNews 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS