ఈడొచ్చిన అమ్మాయితో స్టార్ హీరో దురుసుగా?

షారూఖ్ ప్రారంభంలో దురుసుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, క‌ఠినంగా ఉన్నాడని `మా` ప్ర‌మోష‌నల్ ఇంట‌ర్వ్యూలో సీనియ‌ర్ న‌టి కాజోల్ అన్నారు.;

Update: 2025-06-22 10:30 GMT

ఈరోజు పెద్ద స్టార్లు కావొచ్చు.. కానీ అలాంటి స్టార్లు కూడా ఒక‌ప్పుడు అంత‌గా ప‌రిణ‌తి లేనివాళ్లే. టీనేజీ దాటుకుని అప్పుడ‌ప్పుడే అడ‌ల్ట్ ఏజీలో అడుగుపెట్టి, ఆ త‌ర్వాత న‌టులుగా సినీరంగంలో పాతుకు పోయే క్ర‌మంలోనే రావాల్సిన ప‌రిణ‌తి వ‌స్తుంది. అప్ప‌టివ‌ర‌కూ చాలా మంది దురుసుగానో, దుందుడుకుగానో ఉంటారు. కింగ్ ఖాన్ షారూఖ్ కూడా దీనికి అతీతుడేం కాద‌ని అత‌డి హీరోయిన్ కాజోల్ చెప్పిన దానిని బ‌ట్టి అర్థ‌మవుతోంది. కెరీర్ ప్రారంభం షారూఖ్ తో న‌టించే క్ర‌మంలో త‌న‌కు ఎదురైన అనుభ‌వాల‌ను తాజా ఇంట‌ర్వ్యూలో కాజోల్ రివీల్ చేసింది.

షారూఖ్ ప్రారంభంలో దురుసుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, క‌ఠినంగా ఉన్నాడని `మా` ప్ర‌మోష‌నల్ ఇంట‌ర్వ్యూలో సీనియ‌ర్ న‌టి కాజోల్ అన్నారు. నేను టాకేటివ్.. బాగా మాట్లాడేదానిని.. అయితే అది అత‌డికి న‌చ్చేది కాదేమో! కానీ మా మ‌ధ్య ఏదీ సీరియ‌స్ గా లేదు. ఇవ‌న్నీ స‌హ‌న‌టుల మ‌ధ్య ప్రారంభ ఇబ్బందులు మాత్ర‌మే. ఆ త‌ర్వాత మేం ఇద్ద‌రం ఎంత‌గానో క‌లిసిపోయాం. మంచి స్నేహితులం అయ్యాము అని బాజీగ‌ర్ డేస్‌ని గుర్తు చేసుకుంది. సెట్లో కొత్త‌గా ఉత్సాహంగా ఉన్న త‌న‌కు అప్ప‌టికి వ‌య‌సు 18. కానీ అత‌డు దురుసుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని కూడా కాజోల్ అంది.

షారూఖ్‌- కాజోల్ జంట కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ లో న‌టించారు. బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ క‌పుల్ గా పాపుల‌ర‌య్యారు. ముఖ్యంగా దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే (డిడిఎల్‌జే) షారూఖ్ - కాజోల్ కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌రపురాని ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాలో అంద‌మైన జంట కెమిస్ట్రీని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. మ‌రో ప‌ది త‌రాల వ‌ర‌కూ ఈ చిత్రం ఒక గొప్ప‌ మెమ‌రీగా హృద‌యాల్లో నిలిచిపోతుంద‌న‌డంలోను సందేహం లేదు.

Tags:    

Similar News