న్యూ ఇయర్ కోసం కాజల్ సరికొత్త మేకోవర్..

కాజల్ అగర్వాల్.. చందమామగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ కాటుక కళ్ళ సుందరి ఎప్పటికప్పుడు తన అందంతో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది.;

Update: 2026-01-01 05:36 GMT

కాజల్ అగర్వాల్.. చందమామగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ కాటుక కళ్ళ సుందరి ఎప్పటికప్పుడు తన అందంతో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇదిలా ఉండగా నూతన సంవత్సరం సందర్భంగా కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ముందుగానే ప్రకటిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.



 


తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను పంచుకున్న కాజల్ అగర్వాల్.. అందులో కొత్త ఏడాదిలో ఇలా ఉండబోతున్నాను అన్నట్టుగా కొన్ని రకాల ఫోటోలను పంచుకుంది.అందులో బెడ్ పై పడుకొని లాప్టాప్ ముందు పెట్టుకుని ఒక ఫోటో షేర్ చేయగా.. మరొక ఫోటోలో మిర్రర్ ముందు స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. మరికొన్ని ఫోటోలలో మేకప్ వేసుకుంటున్నట్టు.. ఇంకొన్ని ఫోటోలలో అందంగా తన మేకోవర్ ను రివీల్ చేసి ఈ కొత్త సంవత్సరం తన నటనతో మరింత బిజీగా మారనున్నట్లు ప్రకటించింది. మొత్తానికైతే కొత్త సంవత్సరం వేళ తన సరికొత్త మేకోవర్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కాజల్ అగర్వాల్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫాలోవర్స్.



 


1985 జూన్ 19న మహారాష్ట్ర బొంబాయిలో జన్మించిన ఈమె 2004లో హిందీ చిత్రమైన క్యూన్ హో గయా నా సినిమాలో చిన్న పాత్రతో నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో 2007లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో లక్ష్మీ కళ్యాణం సినిమాలో నటించి.. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. అదే ఏడాది వచ్చిన చందమామ సినిమాలో తన పాత్రతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర అనే ఫాంటసీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.



 


ఆ తర్వాత డార్లింగ్ , బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, నాయక్, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి , భగవంత్ కేసరి , తుపాకీ, మెర్సల్ ఇలా దాదాపు చాలా సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలతో తనకంటూ ఒక స్టేటస్ ను సొంతం చేసుకుంది కాజల్ అగర్వాల్.ఈమె సోదరి నిషా అగర్వాల్ కూడా నటి కావడం గమనార్హం.



 


కాజల్ అగర్వాల్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. రామాయణ అని హిందీ చిత్రంలో నటిస్తోంది. ఈమె తదుపరిచిత్రాలు విషయానికొస్తే తమిళ్లో గరుడ అనే సినిమాలో నటిస్తున్న ఈమె కన్నడలో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమాలో నటిస్తోంది. ఇలా ఈ యేడాది దాదాపు అన్ని భాషలను టచ్ చేస్తూ సక్సెస్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Tags:    

Similar News