సమంత రూట్ లో కాజల్..?

ప్రస్తుతం కాజల్ కెరీర్ సందిగ్ధంలో ఉంది. ఎలాగు పెళ్లైంది కాబట్టి రిలాక్స్ అయిపోవచ్చు. కానీ కాజల్ లేదు నేను వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా దూకుడు చూపిస్తుంది.;

Update: 2025-05-27 16:30 GMT

సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ పెళ్లికి ముందు దాకా సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా వరుస ఛాన్స్ లు అయితే వచ్చాయి. వాటిని చేస్తూ అమ్మడు కెరీర్ కొనసాగించింది. ఐతే ఎప్పుడైతే కాజల్ కి పెళ్లైందో అప్పటి నుంచి పెద్దగా అవకాశాలు రాలేదు. పెళ్లి తర్వాత చేసిన ఆచార్యలో కూడా ఆమె రోల్ తీసే సరికి ఇంకాస్త ఇబ్బంది అయ్యింది. అఫ్కోర్స్ ఆచార్యలో ఆమె ఉన్నా ఫలితం పెద్దగా తేడా ఉండేది కాదు.

ఐతే ఈమధ్య సత్యభామ అంటూ ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాతో వచ్చింది కాజల్. ఆ సినిమా తో తనలోని డిఫరెంట్ యాంగిల్ ని ప్రజెంట్ చేయాలని అనుకుంది. ఐతే ఆ సినిమా మాత్రం అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. సత్యభామ హిట్ పడితే అదే పంథాలో కాజల్ మరికొన్ని ప్రయత్నాలు చేసేది కానీ అలా చేయడం కుదరలేదు. ఇక రెండేళ్ల క్రితం భగన్వంత్ కేసరి సినిమాలో నటించింది కాజల్ ఆ సినిమాలో ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టే ఆమె కనిపించింది.

ప్రస్తుతం కాజల్ కెరీర్ సందిగ్ధంలో ఉంది. ఎలాగు పెళ్లైంది కాబట్టి రిలాక్స్ అయిపోవచ్చు. కానీ కాజల్ లేదు నేను వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా దూకుడు చూపిస్తుంది. ఈ క్రమంలో కాజల్ మరో స్టార్ హీరోయిన్ సమంతని ఫాలో అవ్వాలని చూస్తుంది. సమంత స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. పెళ్లి ఆ తర్వాత డైవర్స్ ఇవన్నీ ఆమె పర్సనల్ కెరీర్ ని ఎఫెక్ట్ చేసినా ప్రొఫెషనల్ గా మాత్రం సమంత క్రేజ్ తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ సీరీస్ లతో సమంత రేంజ్ మరింత పెరిగింది.

ఈమధ్య ఆమె నిర్మాతగా మారి శుభం సినిమా చేసింది. ఆ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. సో సమంత తరహాలోనే కథల విషయంలో కాస్త కొత్తగా ఆలోచించాలని అనుకుంటుంది కాజల్. అంతేకాదు ఆమె చేస్తున్న సినిమాలను అబ్సర్వ్ చేస్తూ అదే తరహా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. సమంతని ఫాలో అవ్వాలని చూస్తున్న కాజల్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలి. సమంత మాత్రం ఇటు సౌత్ అటు నార్త్ అనే తేడాలేకుండా అదరగొట్టేస్తుంది. కాజల్ మళ్లీ తిరిగి ఫాం లో రవడం అంటూ జరిగితే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి సూపర్ హ్యాపీ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News