మాల్దీవ్స్ అందాలు.. కాజల్ సోయగాలు.. పిక్స్ చూశారా?

అయితే ఓ వైపు సినిమాలు.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్న కాజల్.. సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ దగ్గరగా ఉంటారు.;

Update: 2025-08-30 04:24 GMT

సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే. తన యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు.. స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నారు. లక్ష్మీ కళ్యాణం మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీ.. తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ మనసులో నిలిచిపోయారు. చందమామ మూవీతో టాలీవుడ్ చందమామగా మారారు.


ఆ తర్వాత దాదాపు అందరి స్టార్ హీరోలతో ఆడిపాడిన అమ్మడు.. స్టార్ హీరోయిన్ గా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద అనేక హిట్స్ కూడా అందుకున్న కాజల్.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రేమలో పడి ప్రియుడిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.


2020లో గౌతమ్ కిచ్లాను వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్.. 2022లో కుమారుడు నీల్ కిచ్లూకు జన్మనిచ్చారు. అయితే పెళ్లి అయ్యాక కొన్ని సినిమాల్లో కనిపించిన బ్యూటీ.. బాబు పుట్టాక తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. కాస్త గ్యాప్ ఇచ్చి లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామలో నటించారు.


కానీ అనుకున్న స్థాయిలో హిట్ అందుకోని కాజల్.. ఆ తర్వాత మంచు విష్ణు భక్త కన్నప్ప మూవీలో పార్వతీ దేవిగా కనిపించారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఓ వైపు సినిమాలు.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్న కాజల్.. సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడూ దగ్గరగా ఉంటారు.


ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో వెకేషన్స్ కు వెళ్లే టాలీవుడ్ చందమామ రీసెంట్ గా మాల్దీవ్స్ వెళ్లారు. ఇప్పుడు ఆ పిక్స్ ను షేర్ చేయగా.. ప్రస్తుతం అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి. "మాల్దీవ్స్.. నేను హ్యాపీగా మంత్లీ మీటింగ్. అంతులేని ఆకర్షణ, శాశ్వతమైన కాంతి, ప్రకృతి అత్యంత ఆకర్షణీయమైన రన్‌వేలా అనిపించే సూర్యాస్తమయాలతో ప్రతిసారీ ఆకర్షించింది" అంటూ రాసుకొచ్చారు


అయితే పిక్స్ లో కాజల్ వేరే లెవెల్ లో ఉన్నారు. ఎల్లో, బ్లూ, వైట్ కలర్ స్విమ్ సూట్స్ లో దిగిన ఫోటోస్ పోస్ట్ చేయగా.. ఒక్కొక్కటి ఓ రేంజ్ లో ఉంది. ఆమె పోజులు, లుక్స్ అదిరిపోయాయి. తన సోయగాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లు ఉన్నాయి చిత్రాలు. కొడుకుతో నడుస్తున్న పిక్ క్యూట్ గా ఉండగా.. భర్తతో ఐకానిక్ పోజ్ ఇచ్చారు అమ్మడు. మొత్తానికి 40 ఏళ్ల వయసులో కాజల్ హీట్ పుట్టిస్తున్నారని చెప్పాలి. మరి ఆమె పిక్స్ ను చేశారా?

Tags:    

Similar News