బికినీలు- ఇంటిమేట్ సీన్లకు ఓకేనా? కాజల్ ఊహించని ట్విస్టు!
సినిమా రంగంలో ఎంతటి భారీ ప్రాజెక్ట్ అయినా.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. తాను పెట్టుకున్న వ్యక్తిగత పరిధులు దాటనని కాజల్ చాలా కచ్చితంగా చెప్పారు.
చందమామ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడిన తర్వాత సెలక్టివ్ గా మాత్రమే నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ నటించిన `ది ఇండియా స్టోరి` కథాంశం కారణంగా దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తన సినిమా ప్రమోషన్స్ లో కాజల్ యాక్టివ్ గా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో గ్లామర్ సీన్స్, ఆన్-స్క్రీన్ ఎక్స్‌పోజింగ్‌పై కాజల్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..వెండితెరపై బికీనీ - అత్యంత ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం తనకు అస్సలు ఇష్టం ఉండదని కాజల్ స్పష్టం చేశారు. అవి చాలా వ్యక్తిగతమైన విషయాలని...అలాంటి వాటిని స్క్రీన్‌పై ప్రదర్శించడానికి తన మనసు అంగీకరించదని చెప్పారు.
సినిమా రంగంలో ఎంతటి భారీ ప్రాజెక్ట్ అయినా.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. తాను పెట్టుకున్న వ్యక్తిగత పరిధులు దాటనని కాజల్ చాలా కచ్చితంగా చెప్పారు. సినిమా అవకాశాల కోసం లేదా క్రేజ్ కోసం తన నమ్మకాలను, హద్దులను ఎప్పుడూ పక్కన పెట్టలేదని... కెరీర్ ఆరంభం నుండి ఆ సూత్రాలకే కట్టుబడి ఉన్నానని కాజల్ పేర్కొన్నారు.
టాలీవుడ్‌లో దశాబ్ద కాలానికి పైగా అగ్ర కథానాయికగా రాణించిన కాజల్... కేవలం స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలే కాకుండా తన పరిధుల్లో ఉంటూనే గ్లామరస్ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పెళ్లయి, జూనియర్ కిచ్లుకి తల్లి అయిన తర్వాత కూడా కథా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్న కాజల్.. బోల్డ్ సీన్స్‌పై ఈ విధంగా బో*ల్డ్‌గా రియాక్ట్ అవ్వడంపై నెటిజన్లు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశ ఆరోగ్యం ప్రజల వ్యక్తిగత బాధ్యతపైనే ఉంది..
చందమామ కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలో నటించిన `ది ఇండియా స్టోరీ` చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ తాజా ఇంటర్వ్యూలో దేశ ప్రగతి, ప్రజల బాధ్యతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం ఆరోగ్యంగా, బలంగా ముందుకు సాగాలంటే కేవలం ఇతరులపై నిందలు వేయడం ఆపి.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన ఇంట్లో నీటిని ఆదా చేస్తున్నామా? విద్యుత్‌ను సరిగ్గా వాడుతున్నామా? పరిశుభ్రతను పాటిస్తున్నామా? అనే చిన్నచిన్న వ్యక్తిగత ప్రయత్నాలే చివరకు దేశాన్ని ఆరోగ్యవంతంగా మారుస్తాయని స్పష్టం చేశారు.
ఇక ఈ చిత్రంలో శ్రేయాస్ తల్పాడే కీలక పాత్ర పోషించగా..కాజల్ అగర్వాల్ `అడ్వకేట్ అర్చన` అనే పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. వ్యవసాయంలో పురుగుమందుల మితిమీరిన వినియోగం.. ఆహార కల్తీలు ప్రజారోగ్యంపై చూపుతున్న తీవ్ర దుష్పరిణామాల చుట్టూ ఈ సినిమా కథాంశం సాగుతుంది. శక్తివంతమైన కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడే ఒక కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన `ది ఇండియా స్టోరీ`.. ఆహార భద్రత-పర్యావరణ సమస్యలపై సమాజంలో ఒక మంచి చర్చను లేవనెత్తుతుందని చిత్రబృందం భావిస్తోంది.