ఆ రెండు భాగాల‌ను మించిన‌ క‌ష్టంతో రాజ‌మౌళి!

పరిమితమైన స్థలంలో భారీ కెమెరా సెటప్‌లను అమర్చడం, వెలుతురును కంట్రోల్ చేయడం, పర్యాటకుల రద్దీని తట్టుకుని షూటింగ్ జరపడం వంటివి సాధారణ విషయం కాదు.

Update: 2026-07-09 15:36 GMT

భారతీయ చలనచిత్ర చరిత్రను మలుపు తిప్పిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం `వారణాసి` వేదికగా త‌న మేకింగ్ మ్యాజిక్‌ను ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. `బాహుబలి` వంటి భారీ చిత్రాల కోసం ఎంత‌గా శ్ర‌మించారో? అంతకు మించిన కష్టాన్ని వార‌ణాసి షూటింగ్ కోసం పడుతున్నారని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలు అనగానే భారీ సెట్లు, వందల కోట్ల బడ్జెట్ గుర్తుకొస్తాయి. కానీ `వారణాసి`లో జరుగుతున్న షూటింగ్ అందుకు భిన్నంగా, సహజసిద్ధమైన లొకేషన్లలో అత్యంత క్లిష్టమైన సవాళ్లతో సాగుతోంది. అవ‌సరం మేర వార‌ణాసి సెట్లు వేసి కొంత షూటింగ్ చేసినా? రియ‌ల్ లొకేష‌న్స్ లో చేసిన సీన్స్ వేరే లెవ‌ల్లో ఉంటాయి.

`వారణాసి`లోని గంగా తీరం, పురాతన కట్టడాలు , జనసమ్మర్థం ఎక్కువగా ఉండే వీధుల్లో షూటింగ్ చేయడం ఏ దర్శకుడికైనా పెద్ద పరీక్ష. భారీ సెట్లు నిర్మించే అవకాశం లేని ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని కథకు తగ్గట్టుగా మలచుకోవడం రాజమౌళికి పెద్ద సవాలుగా మారింది. `బాహుబలి`లో సాంకేతిక పరిజ్ఞానంతో దృశ్యాలను సృష్టిం చడం ఒక ఎత్తు అయితే? ప్రకృతిని , సహజ సౌందర్యాన్ని కథాంశంతో మేళవించడం మరో ఎత్తు. అందుకే ఈ చిత్రం కోసం ఆయన ఎంతో శ్రద్ధతో ప్రణాళికలు రచిస్తున్నారు.

వాస్త‌వానికి వారణాసిలో షూటింగ్ చేయడం అంటే సాంకేతికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవడమే. పరిమితమైన స్థలంలో భారీ కెమెరా సెటప్‌లను అమర్చడం, వెలుతురును కంట్రోల్ చేయడం, పర్యాటకుల రద్దీని తట్టుకుని షూటింగ్ జరపడం వంటివి సాధారణ విషయం కాదు. కానీ రాజమౌళి పట్టుదలతో ఈ సవాళ్లను అధిగమిస్తున్నారు. ఒక్కో సన్నివేశాన్ని ఆశించిన స్థాయిలో చిత్రీకరించడానికి ఆయన పడుతున్న తపన, కెరీర్‌లో ఇప్పటివరకు చూడని డెడికేషన్ కు నిదర్శనమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి అనుసరిస్తున్న మేకింగ్ శైలి పూర్తిగా భిన్నంగా ఉందని సమాచారం. `బాహుబలి` లాంటి పీరియాడిక్ డ్రామాలో సెట్లు ప్రాణం పోస్తే ఈ చిత్రంలో వారణాసి నగరమే ఒక పాత్రలా కనిపిస్తుందిట‌. నగరంలోని వైబ్రేషన్స్‌ను, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ప్రతి ఫ్రేమ్‌ను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. భారీ గ్రాఫిక్స్ పైన కాకుండా సహజత్వాన్ని పండించే అంశాలపైనే రాజ‌మౌళి ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇది రాజమౌళిలోని వైవిధ్యమైన దర్శకుడిని మరోసారి ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

`బాహుబలి` విజయం తర్వాత రాజ‌మౌళి చేసే ఏ సినిమా అయినా సరే ఆ అంచనాలను అందుకోవాల్సిందే. అందుకే రాజమౌళి ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా పని చేస్తున్నారు. వారణాసిలో రాజ‌మౌళి పడుతున్న కష్టం, థియేటర్లలో ప్రేక్షకులకు ఓ సరికొత్త దృశ్య కావ్యాన్ని పరిచయం చేస్తుందని నమ్మకం కలుగుతోంది. మేకింగ్ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను కూడా రాజ‌మౌళి ఆనందంగా భరిస్తున్నారు అంటే, సినిమా ఫలితం ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. బ్లాక్ ఫారెస్ట్ లాంటి క‌ఠిన‌మైన లొకేష‌న్లలో షూటింగ్ అంత‌కు రెండిత‌లు క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ఇక్క‌డ ఇంకా స‌వాళ్లు ఎదుర‌వుతాయ‌న్న‌ది అంతే వాస్త‌వం.

Tags:    

Similar News