'లెనిన్' ప్రమోషన్స్‌లో గ్లామర్ షో… భాగ్యశ్రీ హైలైట్!
ప్రముఖ డిజైనర్ భార్గవి కునమ్ డిజైన్ చేసిన ట్రెడిషనల్ లెహంగాలో భాగ్యశ్రీ బోర్సే లంగావోణి రాయల్ లుక్‌ను గుర్తుచేస్తోంది.
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' రేపు (జూలై 10న) థియేటర్లలోకి వస్తున్న సందర్భంగా ఈ భామ అదిరిపోయే ఫోటోషూట్ షేర్ చేసింది. రాయల్ బ్లూ, పాస్టెల్ లైమ్-గ్రీన్ లెహంగా కాంబినేషన్‌లో వింటేజ్ సౌత్ ఇండియన్ లుక్‌తో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ సినిమాలో తాను పోషించిన 'భారతి' క్యారెక్టర్ అందరి హృదయాల్లో నిలిచిపోతుందని చెప్తూ ప్రమోషన్స్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆ విశేషాలు చూద్దాం..
కనువిందు చేస్తున్న వింటేజ్ లుక్:
ప్రముఖ డిజైనర్ భార్గవి కునమ్ డిజైన్ చేసిన ట్రెడిషనల్ లెహంగాలో భాగ్యశ్రీ బోర్సే లంగావోణి రాయల్ లుక్‌ను గుర్తుచేస్తోంది. లైమ్-గ్రీన్ కలర్ లంగా, దానికి మ్యాచ్ అవుతూ జరి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న రాయల్ బ్లూ బ్లౌజ్ ధరించింది. చేతులకు వేసుకున్న బ్లూ అండ్ గోల్డ్ గాజులు, పెటల్స్ బై స్వాతి జ్యువెలరీ ఆమెకు పక్కా పల్లెటూరి అందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
అఖిల్ 'లెనిన్' పైనే భారీ ఆశలు:
రేపు విడుదల కాబోతున్న 'లెనిన్' సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అఖిల్ అక్కినేని కెరీర్‌కు ఈ సినిమా సక్సెస్ ఎంత ముఖ్యమో, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి కూడా అంతే ముఖ్యం. ఇక కింగ్ నాగార్జున, నిర్మాత సూర్యదేవర నాగవంశీతో పాటు చిత్ర యూనిట్ అంతా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ఎంతో ధీమాగా ఉన్నారు.
భాగ్యశ్రీ కు వెంటనే ఒక హిట్ అవసరం:
టాలీవుడ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఆమె పెద్ద ప్రాజెక్టులే చేస్తోంది. రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’, విజయ్ దేవరకొండతో ‘కింగ్‌డమ్’, రామ్ పోతినేని సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వంటి క్రేజీ సినిమాలు చేసింది. అలాగే తమిళం నుంచి డబ్ అయిన ‘కాంత’ సినిమాలోనూ ఆమే మెయిన్ లీడ్. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటివరకు సరైన కమర్షియల్ సక్సెస్ పడలేదు. అందుకే ఈ 'లెనిన్' మూవీపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది.
చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు:
హిట్స్ లేకపోయినా భాగ్యశ్రీ క్రేజ్‌కు, అవకాశాలకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన ‘సియోన్’ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా టాలీవుడ్‌లో మరికొందరు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇండస్ట్రీలో మరింత నిలదొక్కుకోవడానికి, రెమ్యూనరేషన్ పెరగడానికి ఈమెకు ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం.
స్టైల్, గ్లామర్, యాక్టింగ్ పరంగా భాగ్యశ్రీ బోర్సే ఎప్పుడూ బెస్ట్ ఇస్తూనే ఉంటుంది. ‘లెనిన్’ సినిమాలో ‘భారతి’గా ఆమె పాత్ర ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. మరి రేపు రాబోతున్న ఈ సినిమా భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌ను మలుపు తిప్పి, టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారుస్తుందో లేదో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.