మారిన ట్రెండ్: పెళ్లయినా తగ్గేదే లే అంటున్న‌ క్రేజీ హీరోయిన్లు

ఇక బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోణె.. రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడిన తర్వాత `గెహ్రాయాన్‌` లాంటి క్రేజీ ఎంటర్‌టైనర్‌లో నటించి సరికొత్త వివాదానికి తెరలేపారు.

Update: 2026-07-09 23:30 GMT

ఒకప్పుడు సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్లయిందంటే చాలు.. హోమ్లీ పాత్రలకో లేదా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకో పరిమితమైపోయేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోయింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టినా అది వృత్తిప‌రంగా అడ్డంకి కాదు. భ‌ర్త‌ల ప్రోత్సాహంతో తమ వృత్తిని స్వేచ్ఛాయుతంగా కొన‌సాగించేందుకే న‌టీమ‌ణులు మొగ్గు చూపుతున్నారు. పెళ్లి తర్వాత కూడా స్క్రీన్‌పై గ్లామర్ ఆరబోస్తూ.. ఘాటైన రొమాంటిక్ సీన్లలో నటిస్తూ ప్రేక్షకులలో హాట్ టాపిగ్గా మారుతున్న‌ స్టార్ హీరోయిన్లు ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు.

ఈ లిస్ట్‌లో మొదటగా చెప్పుకోవాల్సింది మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్యా రాయ్ గురించి. పెళ్లి తర్వాత `ధూమ్ 2` చిత్రంలో హృతిక్ రోషన్‌తో చేసిన రొమాన్స్, కిస్సింగ్ సీన్స్ అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించాయి. ఐశ్వర్య చేసిన ఆ గ్లామర్ షోను భర్త అభిషేక్ బచ్చన్, అత్త జయాబచ్చన్ తీవ్రంగా వ్యతిరేకించారని అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అలాగే విద్యాబాలన్ సైతం పెళ్లి తర్వాత మరింత బోల్డ్ పాత్రలను ఎంచుకున్నారు. ముఖ్యంగా `డర్టీ పిక్చర్` బ‌యోపిక్ చిత్రం విద్యాబాలన్ కెరీర్‌లోనే అత్యంత హాట్ అండ్ బోల్డ్ అటెంప్ట్‌గా నిలిచింది.

ఇక బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోణె.. రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడిన తర్వాత `గెహ్రాయాన్‌` లాంటి క్రేజీ ఎంటర్‌టైనర్‌లో నటించి సరికొత్త వివాదానికి తెరలేపారు. ఈ సినిమాలో యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో దీపిక ఘాటైన రొమాంటిక్ సీన్స్, లిప్‌లాక్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో ఇలాంటి సీన్లు చూసి భర్త రణ్‌వీర్ ఫీలవ్వడా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు కురిపించారు. మరో టాప్ నటి కత్రినా కైఫ్ సైతం విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉన్నప్పుడు - పెళ్లయిన తర్వాత కూడా `టైగర్ 3` చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో రొమాంటిక్ బాండింగ్‌ను కొనసాగించి వార్తల్లో నిలిచారు.

ప్రస్తుత జనరేషన్ హీరోయిన్లలో కియారా అద్వాణీ, రష్మిక మందన్న వంటి వారు కూడా పెళ్లి తర్వాత తమ గ్లామర్ డోస్‌ను తగ్గించడం లేదు. కియారా అద్వాణీ సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న తర్వాత పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` లో రాకింగ్ స్టార్ యష్ సరసన అత్యంత ఘాటైన రొమాంటిక్ పాత్రలో నటించారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్, పాట‌ల్లో కియ‌రాతో య‌ష్ ఘాటైన రొమాన్స్ హ‌ద్దులు దాటింద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా నెటిజన్లు `భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఫీలయ్యాడు` అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదేవిధంగా రష్మిక మందన్న `కాక్ టైల్ 2` చిత్రంలో పొట్టి దుస్తులు ధరించి, షాహిద్ కపూర్‌తో కలిసి ఒక ఘాటైన పాత్రలో రొమాన్స్ చేస్తూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు.

మరోవైపు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడి ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కెరీర్‌లో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ప్రస్తుతం యష్ `టాక్సిక్` చిత్రంలో నయనతార కూడా ఒక అదిరిపోయే గ్లామరస్ అవతార్‌తో ప్రేక్షకులను మురిపిస్తున్నారు. అయితే నయనతార గ్లామర్ షోకు కొన్ని సొంత పరిధులు, గీతలు గీసుకుని మరీ నటిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. మొత్తానికి పెళ్లి అనేది నటనకు, గ్లామర్‌కు అడ్డంకి కాదని నిరూపిస్తూ.. భర్తల సపోర్ట్‌తో కెమెరా ముందు రొమాంటిక్ సీన్లలో చెలరేగిపోతున్న నేటి తరం హీరోయిన్ల బోల్డ్‌నెస్ నిజంగానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News