• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ, రజినీ వద్దన్న...

బన్నీ, రజినీ వద్దన్న హిట్‌ మూవీ ఏంటో తెలుసా?

| ఇప్పుడు అదే తరహా ప్రచారం ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

By - Tupaki Desk
Update: 2024-09-04 13:30 GMT

సినిమా ఇండస్ట్రీలో చాలా కథలు ఒక హీరోకు నచ్చక పోవడంతో మరో హీరో వద్దకు వెళ్తూ ఉంటాయి. ఒక హీరో నో చెబితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి మరో హీరో వద్దకు తీసుకు వెళ్లడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. పవన్‌ కళ్యాణ్ వద్దకు వెళ్లిన చాలా కథలను ఆయన ఏదో కారణం వల్ల తిరస్కరించారని, వాటిల్లో కొన్ని రవితేజ చేసి సూపర్‌ హిట్స్ ను దక్కించుకున్నాడనే వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. చాలా రీమేక్ లు అలా చేతులు మారిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అలాంటి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అదే తరహా ప్రచారం ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా రూపొంది 2015లో విడుదల అయిన 'భజ్రంగీ భైజాన్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఆ సినిమాకు టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథను అందించారు. ఆ సినిమా తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ రైటర్ గా విజయేంద్ర ప్రసాద్‌ కి గుర్తింపు లభించింది. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న భజరంగీ భాయిజాన్ సినిమా కథ రెడీ అయిన వెంటనే సల్మాన్‌ ఖాన్ వద్దకు వెళ్ల లేదట. ఇద్దరు ముగ్గురు హీరోలు నో చెప్పిన తర్వాత అప్పుడు సల్లూ భాయ్‌ వద్దకు వెళ్లిందట.

ఈ సినిమా కథను మొదట అల్లు అర్జున్ వద్దకు తీసుకు వెళ్లడం జరిగిందట. గతంలో చిరంజీవి నటించిన ఒక సినిమాకు కాస్త అటు ఇటుగా కథ ఉందని, దానికి కాపీ అంటారనే ఉద్దేశ్యంతో బన్నీ ఆ కథ కు నో చెప్పాడట. కథ లో మార్పులు చేర్పులు చేసినా కూడా ఆసక్తి లేదని చెప్పేశాడట. దాంతో తమిళ్ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ వద్దకు ఇదే కథ వెళ్లిందట. ఆయన కూడా కథ బాగానే ఉంది కానీ నేను చేయలేను అంటూ చేతులు ఎత్తేశాడట. ఇంకా అక్కడ ఇక్కడ తిరిగి చివరకు సల్మాన్‌ ఖాన్ వద్దకు కథ చేరుకుంది. ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సినిమా వచ్చింది.

దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ఇటీవల ఒక చిట్‌ చాట్ లో ఈ విషయాన్ని ప్రస్థావించాడు. తెలుగు హీరో అల్లు అర్జున్‌, తమిళ్‌ హీరో రజినీకాంత్ తిరస్కరించిన తర్వాత కొన్ని నెలలు వెయిట్‌ చేసి సల్మాన్‌ ఖాన్ తో చిన్న చిన్న మార్పులు చేసి సినిమాను రూపొందించినట్లు చెప్పుకొచ్చాడు. కమర్షియల్‌ గా భారీ విజయాన్ని భజరంగీ భాయిజాన్ సినిమా దక్కించుకుంది. వంద కోట్ల లోపు బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమాకు వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. సల్మాన్‌ కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల జాబితాలో భజరంగీ భాయిజాన్ నిలిచిన విషయం తెల్సిందే. అదే కథ తో అల్లు అర్జున్‌ లేదా రజినీకాంత్‌ చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో కదా..!

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Alluarjun 
  • Rajinikanth 
  • Salmankhan 
  • Kabirkhan 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS