ఏంటీ.. భాగ్య శ్రీ ఫస్ట్ ఫిలిం 'కాంతా' నా.. క్లారిటీ ఇచ్చిన రానా!
ప్రస్తుతం భాగ్యశ్రీ కాంత అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది.;
ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్న హీరోయిన్స్ లో భాగ్యశ్రీ ఒకరు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో మొదటిసారి కనిపించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. వాస్తవానికి హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ అంటేనే కొన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఆ అంచనాలను మినిమం అందుకోలేకపోయింది.
సినిమా విడుదల కాకముందే భాగ్యశ్రీ గురించి విపరీతమైన పాజిటివ్ పోస్టులు కనిపించాయి. తన పర్ఫామెన్స్, అందం చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ అనే సినిమాలో నటించింది. గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ పలు సందర్భాలలో విపరీతమైన ఎలివేషన్స్ ఇచ్చాడు. అయితే ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రివ్యూ సాధించుకుంది. తర్వాత డిజాస్టర్ గా నిలిచింది.
భాగ్య శ్రీ ఫస్ట్ ఫిలిం కాంతా
ప్రస్తుతం భాగ్యశ్రీ కాంత అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఒక దర్శకుడు మరియు నటుడు మధ్య సాగే ఇగో గురించి ఈ సినిమా కథ నడుస్తుంది.
ఈ సినిమాకి సంబంధించి దాదాపు ఒక 60, 70 మందిని హీరోయిన్ గా అనుకున్నారట. రానా ఫోన్లో అంతమంది ఫోటోలు కూడా ఆ రోజుల్లో ఉండేవి. ఒకరోజు చెన్నైలో భాగ్యశ్రీ ఈ సినిమా కోసం ఆడిషన్ కి వచ్చారు. అయితే ఆడిషన్ కి వచ్చినప్పుడు స్టైల్ గా క్యాప్ కూడా పెట్టుకొని వచ్చారట. పైగా ఈమెకు ఇది తొలి సినిమా.. అందుకే అలా స్టైలిష్ లో వచ్చిందట.
కానీ ఒక్కసారి చీరలో ఈ సినిమాకి సంబంధించి ఆడిషన్ ఇచ్చిన తర్వాత సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అని అప్పుడే ఫిక్స్ అయ్యారట నిర్మాత రానా. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఈ తరుణంలో జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలన్నీ బయటకు రివిల్ చేశారు రానా.
ఈ సినిమా చేస్తూనే ఆ సినిమాలు
అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే.. కాంతా సినిమా మొదలు పెట్టడానికి దాదాపు చాలా సమయం పట్టిందట. ముఖ్యంగా ఈ సినిమా కోసం తన ఫ్యామిలీతో పాటు పెట్ డాగ్ ని కూడా తీసుకొచ్చి.. చెన్నైలో అద్దె ఇంట్లో దిగిందట భాగ్యశ్రీ. సినిమా షూటింగ్ గురించి ఎప్పుడు అడిగినా ఇదిగో అని చెప్పేవారట రానా.. దాంతో ఎంతకి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో తిరిగి ముంబై వెళ్ళిపోయిందట భాగ్యశ్రీ. ఆ తర్వాత వేరే సినిమాలలో అవకాశాలు వచ్చినట్లు తెలిపింది. అలా కాంతా సినిమా మొదలుపెట్టిన టైం కి భాగ్యశ్రీ.. ఈ సినిమాతో పాటు మిగతా సినిమాలు కూడా చేశారట. ఈ సినిమా రిలీజ్ లేట్ అవ్వడం వలన ఆ సినిమాలు ముందు రిలీజ్ అయిపోయాయి.
అయితే ఇప్పటివరకు భాగ్యశ్రీ కి హీరోయిన్ గా చెప్పుకునే హిట్ సినిమా పడలేదు. ఇక కాంత సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి. మరోవైపు రాం పోతినేని హీరోగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది . ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అలానే సినిమాకి సంబంధించిన కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ రెండు సినిమాలు భాగ్యశ్రీకి ఏ సినిమా పేరు తీసుకొస్తుందో చూడాలి.