జ్యోతిరాయ్.. ఇంతకంటే హీటెక్కించే లుక్ ఉంటుందా..

ఇటీవలి కాలంలో టెలివిజన్ కథానాయికలు సైతం తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు

Update: 2024-05-17 02:45 GMT

ఇటీవలి కాలంలో టెలివిజన్ కథానాయికలు సైతం తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీరిలో కొందరు మోడల్స్‌ను తలపించేంత గ్లామర్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి రాయ్ టాప్ లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. తెలుగు ప్రేక్షకులకు 'జగతి' పాత్ర ద్వారా బాగా దగ్గరైన జ్యోతి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక ఆమె ఇటీవల సుకు పూర్వాజ్ అనే దర్శకుడితో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆమె తన పేరును కూడా మార్చుకుని, ప్రస్తుతం జ్యోతి పూర్వాజ్ గా కొనసాగుతోంది. జ్యోతి తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవలి కాలంలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కేవలం కొన్ని గంటల్లోనే వైరల్ అవుతున్నాయి.

రీసెంట్ గా ఆమె మినీ డ్రెస్సులో మతిపోయేలా దర్శమిచ్చింది. తన లెగ్స్ అందాలతో గతంలో ఎప్పుడు లేనంత స్ట్రాంగా ఆకట్టుకుంది. పాజిటివ్ రియాక్షన్స్ తో అభిమానులు ఆమె గ్లామర్‌ను ప్రశంసిస్తున్నారు. ఆమె బికినీ లుక్ కంటే ఈ కొత్త లుక్ లో మరింత అందంగా ఉందంటూ కొంతమంది ఫాలోవర్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జ్యోతి కెరీర్ విషయానికి వస్తే, 'గుప్పెడంత మనసు' సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయింది. ఆ తరువాత ఆమె సోషల్ మీడియా ద్వారా యూత్ ను ఆకర్షించింది. జ్యోతి రాయ్ భర్త సుకు పూర్వాజ్ 'మాట రాని మౌనమిది' మరియు 'శుక్ర' చిత్రాల దర్శకుడు. ఇటీవల జ్యోతి, సుకు పూర్వాజ్ తో కలిసి ఒక ప్రముఖ చిత్ర దర్శకుడు తెరకెక్కిస్తున్న 'ఏ మాస్టర్ పీస్' సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది.

Read more!

ఈ చిత్రంలో జ్యోతి ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా విజయవంతమైతే, ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్న జ్యోతి తన గ్లామర్‌తో కూడా మంచి క్రేజ్‌ను అందుకుంటోంది. భవిష్యత్తులో హీరోయిన్‌గా స్థిరపడాలన్న లక్ష్యంతో ఈ కన్నడ సుందరి కృషి చేస్తోంది. రాబోయే ప్రాజెక్టులు ఆమెకు ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.

జ్యోతి తన ప్రతిభను, గ్లామర్ ను ఉపయోగించి మరింత ఎక్కువగా ప్రేక్షకులను ఆకర్షించాలని, సినిమాలలోనే కాకుండా వివిధ ఇతర ప్రాజెక్టుల ద్వారా కూడా తన ప్రతిభను నిరూపించాలని ప్రయత్నిస్తోంది. మరి ఈ కొత్త పరిణామాలు, ఫోటోలు, సోషల్ మీడియా ప్రభావం ఆమె కెరీర్ పై ఎలాంటి మార్పులు తీసుకు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News