10 రోజులుగా నిద్ర లేదు.. సినిమా కోసం చాలా కష్టపడ్డా: జ్యోతి కృష్ణ

ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయనతోపాటు డైరెక్టర్ జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ సహా పలువురు అటెండ్ అయ్యారు. ఆ సమయంలో జ్యోతి కృష్ణ మాట్లాడారు.;

Update: 2025-07-21 06:25 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఔరంగజేబు నాటి కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ సినిమా జులై 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. తాజాగా గ్రాండ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయనతోపాటు డైరెక్టర్ జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ సహా పలువురు అటెండ్ అయ్యారు. ఆ సమయంలో జ్యోతి కృష్ణ మాట్లాడారు. నిజానికి.. క్రిష్ జాగర్లమూడి వీరమల్లు మూవీని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తప్పుకోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకుని సినిమాను కంప్లీట్ చేశారు.

"నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. పవన్ ను చూడాలని అందరికీ ఉన్న కోరిక నెరవేరింది. మూవీ వీఎఫ్ ఎక్స్ జరుగుతోంది. ఫైనల్ వర్క్ జరుగుతోంది. 18-20 నిమిషాలతో పవన్ సార్ పై డిజైన్ చేసిన సీన్ ను మిక్స్ చేస్తున్నాం. ఫైట్ లోనే కథ చెబుతున్నాం. ఆ సీక్వెన్స్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి కీరవాణి గారికి 10 రోజులు పట్టింది" అని తెలిపారు.

"ఫైనల్ మిక్స్ చేయడానికి ఎనిమిది గంటలు పట్టింది. చివరగా సీన్ చూశాక.. పవన్ సర్ అనుకున్న సినిమా వేరే. ఆ ఫైర్ కనిపించింది. 17వ శతాబ్దంలో మొగల్ పీరియడ్ స్టోరీ అది. ఆ సమయంలో ఓ పవర్ ఫుల్ రూలర్ కు హరిహర వీరమల్లు మధ్య యుద్ధమే సినిమా. అలాంటి మూవీకి వర్క్ చేసినందుకు ఛాన్స్ వచ్చినందుకు థాంక్స్ చెబుతున్నా" అని చెప్పారు.

"సినిమా బాధ్యతలు తీసుకున్నాక అసలు రిలాక్స్ అవ్వలేదు. మా నాన్న గారు ఏఎం రత్నం గారు కసితో పనిచేశారు. ఓ ఆపరేషన్ అవ్వాల్సి ఉన్నా దాన్ని పక్కన పెట్టి పని చేశారు. నా డెడికేషన్ మొత్తం పెట్టాను. ఆ రిజల్ట్ కనిపిస్తుంది. 10 రోజులుగా ఎవరినీ నిద్రపోవడం లేదు. అందరూ నాతో కష్టపడ్డారు. చాలా స్ట్రెయిన్ అయ్యాం. అందరూ క్లోజ్ అయిపోయాం. కీరవాణి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు" అని పేర్కొన్నారు.

"ఇప్పటివరకు మిస్ అయిన పవన్ గారిని మళ్లీ చూస్తాం. కీరవాణి గారు ప్రతి ఫ్రేమ్ కూడా డాల్ కాకుండా చూశారు. ఎలివేషన్ ఇచ్చి రేపారు. ఫ్యామిలీస్ తో వెళ్లి చూడాలని భావిస్తున్నాం" అంటూ భావోద్వేగకరంగా మాట్లాడారు జ్యోతి కృష్ణ. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News