బాలీవుడ్ డైరెక్టర్లను నమ్మితే ముంచేశారుగా.. లిస్ట్ లో చిరు టూ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు.;

Update: 2025-08-17 19:30 GMT

జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ కాలర్ సెంటిమెంట్ చూశాక.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకున్నారు అభిమానులు. కానీ, ఆ రేంజ్ లో ఈ సినిమాకు ఫలితం రాలేదు. ఇలా భారీ అంచనాలతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే, ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇప్పుడు ఇది తొలిసారి కాదు. టాలీవుడ్ బడా స్టార్లకు బాలీవుడ్ స్టైట్ సినిమాలు ఎప్పుడూ కలిసి రావడం లేదు. నాటి మెగాస్టార్ చిరంజీవీ మొదలుకొని.. ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరకీ నిరాశే ఎదురైంది. 90ల్లో చిరంజీవికి ప్రతి బంద్, ఆజ్ కా గూండారాజ్ సినిమాలు మంచి విజయాలు సాధించినా, ది జెంటిల్ మెన్ ఇచ్చిన షాక్కు ఆయన మళ్లీ అటు వైపునకు వెళ్ళలేదు.

అక్కినేని నాగార్జున విషయానికొస్తే, శివ సినిమా సక్సెస్ తర్వాత ద్రోహి డిజాస్టర్ అయ్యింది. దీంతో నాగార్జున మళ్లీ బీ టౌన్ పై సీరియస్ ఫోకస్ పెట్టలేదు. తక్ధీర్వాలా తేడా కొట్టింది. దీంకో వెంకటేష్ తెలుగుకే పరిమితం అయ్యారు. ఇలా టాలీవుడ్ టాప్ 4 బడా హీరోల్లో నందమూరి బాలకృష్ణ తప్పితే, మిగతా ముగ్గురూ హిందీలో వైఫల్యాలు ఎదుర్కొన్నారు.

ఇక ప్రస్తుతం యంగ్ జనరేషన్ లో రామ్ చరణ్, ప్రభాస్ ఇద్దరూ బాలీవుడ్ కు వెళ్లి కంగుతిన్నారు. చెర్రీ జంజార్ తో ఫెయిల్ అవ్వగా.. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో భంగపడ్డాడు. ఇప్పుడు తాజాగా తారక్ వార్ 2 సినిమాతో ప్రయత్నం చేశారు. కానీ అది మిస్ ఫైర్ అయ్యింది. మరో నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇందులో ఉన్నాడు. యూట్యూబ్ లో వ్యూస్ చూసి.. హిందీ ఛత్రపతి చేశాడు. ఈ సినిమా కోసం ఆయన మూడేళ్ల సమయం వృథా చేసుకున్నాడు.

పోనీ అదైనా హిట్టైందా అంటే, లేదు. అలా బాలీవుడ్ కు పోవడం వల్ల ఇక్కడి మార్కెట్ పై కూడా ఎఫెక్ట్ పడింది. ఇక్కడ ఎన్టీఆర్ తన క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోకపోవడం వల్లే తప్పా... ఈ పొరపాటు జరిగిందని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర స్టార్ మహేశ్ మాత్రం ఇప్పటిదాకా బాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా.. టాలీవుడ్ ను వదిలి పోలేదు. ఇన్నేళ్లకు ప్రస్తుతం బన్ని తమిళ దర్శకుడు అట్లీతో సినిమా తీస్తున్నారు.

Tags:    

Similar News