పాపం తారక్.. అలా అనుకుంటే ఇలా!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన యాక్టింగ్, డ్యాన్స్ మూవ్స్ తో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.;

Update: 2025-08-17 11:07 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన యాక్టింగ్, డ్యాన్స్ మూవ్స్ తో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంత చేసుకున్న తారక్.. కొంతకాలంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు తారక్. నార్త్ టు సౌత్ తన టాలెంట్ తో మెప్పించారు. బాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వార్-2 మూవీతో బీ టౌన్ లో సోలోగా ఎంట్రీ ఇచ్చారు. అయాన్ ముఖర్జీ తీసిన ఆ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ నటించారు.

ఆ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు బాలీవుడ్ ఇమేజ్ ను పదిలం చేసుకోవడానికి అది తారక్ వ్యూహాత్మక చర్యగా అంతా భావించారు. ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పుడు అంతా అదే అనుకున్నారు. సౌత్ డైరెక్టర్ తో పాన్ ఇండియా మూవీ చేసి అక్కడ హిట్ కొట్టడం కన్నా.. అక్కడ వాళ్లతో సినిమా చేయడం తెలివైన నిర్ణయమని అన్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ చేయగా.. ఆ సినిమా కూడా నార్త్ లో రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది. దీంతో వార్-2 మూవీ ఆయనను మరింతగా హిందీ ఆడియన్స్ కు చేరువవుతారని అంతా అనుకున్నారు. అందుకే ఎన్టీఆర్ కూడా రిస్క్ తీసుకుని ఉంటారని భావించారు.

ఎందుకంటే ఇప్పటికే పలువురు బాలీవుడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు కంగుతిన్నారు. డిజాస్టర్స్ తో పాటు ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. జంజీర్ తో రామ్ చరణ్.. ఆదిపురుష్ తో ప్రభాస్.. దారుణమైన పరాజయాలను చవిచూశారు. అయినా తారక్ ప్రతిష్టాత్మక ప్రణాళికతో ముందుకు సాగారు.

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సెలక్షన్ ఆయనకు దెబ్బేసిందని చెప్పాలి. వసూళ్ళ పరంగా వార్-2 ఓకే అయినా.. తారక్ రోల్ విషయంలో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మేకోవర్ తో పాటు పేలవమైన స్క్రీన్ ప్రెజెన్స్ పై అనేక మంది డైరెక్టర్ ను నిందిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తారక్ టాలెంట్ ను అస్సలు యూజ్ చేసుకోలేదని అంటున్నారు. ఆ విషయంలో ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు. మొత్తానికి తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏదో అనుకుంటే ఇలా అయిందనే చెప్పాలి.

Tags:    

Similar News