తారక్ నెక్స్ట్ మూవీకి బ్రేక్ పడిందా?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-08-26 09:52 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీ టౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 మూవీలో కీలక పాత్ర పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో విక్రమ్ గా కనిపించారు. ఆదిత్య చోప్రా నిర్మించిన ఆ మూవీలో తన నటనతో మెప్పించారు.

కానీ ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా బ్లాక్ బస్టర్ హిట్ వార్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన వార్-2తో అనుకున్నంత స్థాయిలో హిట్ మాత్రం అందుకోలేకపోయారు. బాలీవుడ్ డెబ్యూ మూవీతో అనుకోకుండా కంగుతిన్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందని అంతా అభిప్రాయపడ్డారు.

అయితే వార్-2 రిలీజ్ కు ముందు తారక్ బాలీవుడ్ కెరీర్ పై అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ తో వార్-2 తర్వాత మరో మూవీ కూడా చేయనున్నారని టాక్ వినిపించింది. అందులో సోలో హీరోగా నటిస్తారని ప్రచారం జరిగింది. భారీ బడ్జెట్ తో ఆ సినిమాను యష్ సంస్థ నిర్మించనుందని టాక్ వచ్చింది.

అదే సమయంలో యష్ రాజ్ ఫిల్మ్స్ తో కాకుండా సోలోగా బాలీవుడ్ లో ఇంకో సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ చేయనున్నారని గుసగుసలు వినిపించాయి. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానుందని ప్రచారం జరిగింది. కానీ వార్-2 రిజల్ట్ తర్వాత పరిస్థితుల్లో ఛేంజ్ వచ్చిందని ఇప్పుడు బీటౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ అందుకున్న వార్-2.. నష్టాలు మూటగట్టుకోనుందని తెలుస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో కాస్ట్లీ మిస్ ఫైర్ అవుతుందని సమాచారం. నష్టాలు వస్తాయని అంచనాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తారక్ సోలో హీరోగా నటించే బాలీవుడ్ ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్లిందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

వార్-2 ఫుల్ రన్ తర్వాత సినిమాపై నిర్ణయానికి రావొచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే తారక్ అలా డిసైడ్ అయ్యారా.. లేక మేకర్సా అనేది తెలియాల్సి ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్ చేతిలో అనేక భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్నేళ్లపాటు ఆయనకు తీరిక దొరకడం కష్టమే. కాబట్టి బాలీవుడ్ సోలో మూవీని తారక్ చేస్తారో లేదో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News